AP Politics: చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ వర్క్‌షాప్
ABN , Publish Date - Mar 23 , 2024 | 07:24 AM
AP Elections 2024: అమరావతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. చిన్నపాటి అవకాశాన్ని సైతం వదులుకోకుండా ముందుకెళ్తోంది. ఇప్పటికే దాదాపు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను (TDP MLA, MP Candidates) ప్రకటించేసిన టీడీపీ.. అభ్యర్థులకు సలహాలు, సూచనలు చేయడానికి ప్లాన్ చేసింది...
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. చిన్నపాటి అవకాశాన్ని సైతం వదులుకోకుండా ముందుకెళ్తోంది. ఇప్పటికే దాదాపు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను (TDP MLA, MP Candidates) ప్రకటించేసిన టీడీపీ.. అభ్యర్థులకు సలహాలు, సూచనలు చేయడానికి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా శనివారం నాడు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గ ఇంచార్జులకు టీడీపీ వర్క్ షాప్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అధ్యక్షత వహించబోతున్నారు. ఎన్నికల వ్యూహాలపై ఈ వర్క్‌షాప్‌లో కీలక చర్చ జరగనుంది. అభ్యర్థులకు అధినేత కీలక సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01:30 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనున్నది. 11 గంటలకు వర్క్‌షాప్‌ను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగం చేయనున్నారు.
దిశానిర్దేశం!
అభ్యర్థులతో పాటు ఎన్నికల కోసం వారు ప్రత్యేకంగా నియమించుకున్న నలుగురు మేనేజర్లు కూడా ఈ వర్క్ షాప్‌కు హాజరుకాబోతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థులకు ఉండే హక్కులు, అధికార పార్టీ కుట్రలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నది. ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపైనా చర్చ ఉంటుంది. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు అనుసరించాల్సిన పద్దతులను, వ్యూహాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు నిశితంగా వివరించనున్నారు. జనసేన, బీజేపీ పార్టీల నుంచి రాష్ట్రస్థాయి నాయకులు కూడా ఒక్కొక్కరు చొప్పున ఈ వర్క్ షాపులో పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతరం టీడీపీ అగ్రనేతలు మీడియా మీట్ నిర్వహించి.. వర్క్‌షాప్‌నకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశముంది.