Chandrababu: అదుపు తప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అమిత్ షాకు వివరించా..
ABN , Publish Date - Jul 17 , 2024 | 07:05 AM
గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దిగజారిన వినాశకరమైన పరిస్థితిని కేంద్ర హోమంత్రి అమిత్ షాకు వివరించినట్టు సీఎం చంద్రబాబు ట్విటర్ వేదికగా వెల్లడించారు.
అమరావతి: గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దిగజారిన వినాశకరమైన పరిస్థితిని కేంద్ర హోమంత్రి అమిత్ షాకు వివరించినట్టు సీఎం చంద్రబాబు ట్విటర్ వేదికగా వెల్లడించారు. నిన్న సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించినట్టుగా తెలుస్తోంది. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు వెల్లడించారు.
గత 2019-24 ఆర్థిక సంవత్సరాల మధ్య మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదుపు తప్పి, అస్థిరమైన అప్పులను వివరిస్తూ విడుదల చేసిన నాలుగు శ్వేతపత్రాలను వివరించానని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ ఆర్థిక అసమర్థత, నిర్వహణ లోపం, విచ్చలవిడి అవినీతి రాష్ట్రానికి తీరని నష్టాన్ని కలిగించాయి అని వివరించానన్నారు. ఎన్డీఏకి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఫలితాలను గౌరవిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చంద్రబాబు తెలిపారు.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన
Read more AP News and Telugu News