టీడీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులపై డాక్టర్ అరవిందబాబు నిరసన
ABN , Publish Date - May 22 , 2024 | 01:06 AM
తెలుగుదేశం కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తునందుకు నిరసనగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు తన స్వగృహంలో నేలపై పడుకొని నిరసన తెలియజేశారు.

నరసరావుపేట టౌన, మే 21: తెలుగుదేశం కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తునందుకు నిరసనగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు తన స్వగృహంలో నేలపై పడుకొని నిరసన తెలియజేశారు. మంగళవారం నరసరావుపేట పట్టణంలో ప్రకాశనగర్‌లో హౌస్ అరె్‌స్టలో ఉన్న డాక్టర్ చదలవాడ అరవిందబాబు గృహం వద్ద మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నియోజవర్గ లీగల్ సెల్ కార్యదర్శి సీతారామాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ పెట్టిన అక్రమ కేసులలో నిందితులు దొరకకపోతే కార్యకర్తల గృహాలకు వెళ్ళి కుటుంబసభ్యులను టూ టౌన స్టేషనకు తీసుకువెళ్ళి ఇబ్బంది పెడుతున్నారన్నారు. టీడీపీ వాళ్ళు ఇచ్చిన ఏ ఫిర్యాదులు తీసుకోకుండా, వైసీపీ కార్యకర్తలను ఒక్కళ్ళను కూడా అరెస్టు చేయకుండా, టీడీపీ వాళ్ళను ఇప్పటికే పదిమందిని అరెస్టు చేశారన్నారు. ఇంకా అరెస్టులను కొనసాగిస్తున్నారని, రేపు కౌటింగ్‌కు ఏజెంట్‌లు లేకుండా చేయాలనే దుర్ధుదేశ్యంతో పోలీ్‌సలు ఎమ్మెల్యే జేబులో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారని డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఇంటిలో నేలపై పడుకుని నిరసన తెలియజేస్తున్నారన్నారు. సమావేశంలో టీడీపీ లీగల్ సెల్ నియోజవర్గ ఉపాధ్యక్షుడు సురేష్ బాబు, షేక్ ఖాశీమ్ తదితరులు పాల్గొన్నారు.