Satya Kumar Yadav: ఏపీలో క్యాన్సర్ కేసులు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Mar 24 , 2025 | 07:19 PM
Satya Kumar Yadav: బలభద్రపురంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరా తీశారు. ఈ సందర్భంగా వైద్యశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైద్యశిబిరాలు నిర్వీరామంగా కొనసాగించాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.

అమరావతి: క్యాన్సర్ వ్యాధి కేసులు ఎక్కువగా నమోదవుతున్న తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఇంటింటి సర్వే, వైద్యశిబిరాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ కేసులపై ఆరా తీస్తుంది. ఇందుకు సంబంధించి మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా భలబద్రపురంలో అత్యధిక క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయని అనపర్తి ఎమ్మెల్యే అసెంబ్లీలో పేర్కొన్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. దీంతో వెంటనే 31 మెడికల్ టీంలను అక్కడికి పంపామని అన్నారు. నాన్ కమ్యూనికబుల్ 3.0 సర్వేలో భాగంగా నాన్ కమ్యూనికబుల్ డీసీజ్ క్యాన్సర్ స్క్రీనింగ్ మొదలు పెట్టామని చెప్పారు.
ఇప్పటి వరకూ కోటి 93 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా వీరిలో లక్షా నలభై ఐదు వేల 649మంది వేర్వేరు క్యాన్సర్‌లతో బాధపడుతున్న అనుమానిత కేసులు వచ్చాయని తెలిపారు. భలబద్రపురానికి సంబంధించి రెండు రోజుల పాటు 10800 మంది జనాభాలో 3500 ఇండ్లు ఉన్నాయని తెలిపారు. వీరిలో 2803 ఇండ్లవద్దకు వెళ్లి 8830మందికి పరీక్షలు చేయగా 38కేసులు బయటపడ్డాయని తెలిపారు. దీనిలో గతంలో క్యాన్సర్ ఉన్న కేసులు ఉన్నాయన్నారు. ఇండియాలో 14లక్షల 13 వేల కొత్త క్యాన్సర్ కేసులు వచ్చాయన్నారు.లక్ష జనాభాకు 367 మంది అంటే 10వేలు జనాభా ఉన్న భలబద్రపురంలో 32కేసులు ఉన్నాయని తెలిపారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డిను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని అన్నారు.
ఆయన అసెంబ్లీలో మాట్లాడటం వల్ల మీడియాలో, పేపర్లలో హైలెట్ అయ్యి అందరికీ తెలిసిందని అన్నారు. అనపర్తి నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుంటే లక్షా 19వేల మందికి స్క్రీనింగ్ చేయగా 736 సస్పెక్టెడ్ కేసులు వచ్చాయని వివరించారు. క్యాన్సర్ ట్రీట్మెంట్‌ను 2022-25 మధ్య ఎన్టీఆర్ వైద్యసేవ కింద లక్ష 13 వేల 363 మందికి చికిత్స చేశారని తెలిపారు. భలబద్రపురంలో క్యాన్సర్ అనుమానిత కేసులు అసాధారణంగా పెరగలేదని అన్నారు. స్క్రీనింగ్ ట్రైయిన్డ్ సీహెచ్ సెంటర్లలో ఉండే వారు చేస్తారు... ఆశా వర్కర్‌లు కాదని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఆ తరహా క్యాన్సర్‌లు గుర్తించలేదు: వైద్యా ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు
క్యాన్సర్‌ను గుర్తించడానికి చేసే పరీక్ష బయాప్సీ మాత్రమే, మిగిలిన పరీక్షలు అన్ని రూల్ అవుట్ చేయడానికేనని వైద్యా ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. కేజీహెచ్ , గుంటూరు, కర్నూలులో క్యాన్సర్ ట్రీట్మెంట్ సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. తొలిస్టేజుల్లో గుర్తిస్తే లైఫ్ స్పాన్‌ను పెంచుకోవచ్చని అన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా ఓటీంను భలబద్రపురం పంపారని చెప్పారు. పర్యావరణ అంశాలు క్యాన్సర్‌కు కారణం అంటే లంగ్స్, స్కిన్‌లు ఎఫెక్ట్ కావాలని.. కానీ ఆ తరహా క్యాన్సర్‌లు అక్కడ గుర్తించలేదని.. ఇదే అంశంపై సీఎం చంద్రబాబు కూడా రివ్యూ చేశారని కృష్ణబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
TDP MP: విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్
High Court Orders: బోరుగడ్డపై పోలీసుల పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు
Good News: ఏపీ ఉద్యోగులకు పండుగలాంటి వార్త
Read Latest AP News And Telugu News