Share News

వేరుశనగ ఎండుతోంది

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:29 PM

వరుణుడు ముఖం చాటే యడంతో చినుకు జాడలేక ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశ నగ పంట నిలువునా ఎండుతోంది.

వేరుశనగ ఎండుతోంది
పర్తికోట సమీపంలో ఎండుముఖం పట్టిన వేరుశనగ పంట

మొహం చాటేసిన వరుణుడు....జాడలేని చినుకు

వర్షాభావ పరిస్ధితులతో నిలువునా ఎండుతున్న పంట

వర్షం పడకుంటే తీవ్ర నష్టమే

ఏటా వెంటాడుతున్న కష్టాలు..నష్టాలు

అప్పులు తీర్చడమెలా అంటున్న అన్నదాతలు

ములకలచెరువు, సెప్టెంబరు 15: వరుణుడు ముఖం చాటే యడంతో చినుకు జాడలేక ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశ నగ పంట నిలువునా ఎండుతోంది. వానాకాలంలోనూ ఎండలు మండుతున్నాయి. ప్రతి ఏటా అతివృష్టో... అనావృష్టో వేరుశనగ రైతులను ముంచుతోంది. వర్షా భావంతోనూ లేదా అధిక వర్షాలతోనూ ప్రతి ఏటా ఖరీఫ్‌ లో సాగు చేస్తున్న పంటలు చేతికి అందక అన్నదాతలకు అప్పులే మిగులుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమిస్తూ వేరుశనగ సాగు చేస్తున్న రైతులకు కలిసి రావడం లేదు. అప్పోసొ ప్పో చేసి పంట సాగు చే స్తూ నష్టాలను చవిచూస్తున్నా రు. తీవ్ర వర్షాభావ పరిస్ధితుల కారణంగా చినుకు రాలక కళ్లెదుటే వేరుశనగ చెట్లు నిలువునా ఎండిపోతుండడంతో అన్నదాత లు ఆందోళన చెందుతున్నారు.

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు, పెద్దమండ్యం, తం బళ్లపల్లె, పెద్దతిప్పసముద్రం, కురబలకోట మండలాల్లో వర్షాధారంగా ఈ ఖరీఫ్‌లో 6వేల హెక్టార్లలో (15వేల ఎకరాల్లో) వేరుశగన పంట సాగైంది. రైతులు ఎకరాలకు రూ.25వేల వరుకు ఖర్చు చేసి పంట సాగు చేశారు. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి వర్షాలు ఆశించిన స్ధాయిలో పడ్డాయి. దీంతో చెట్లు ఏపుగా పెరిగాయి. ప్రస్తుతం కాయలు దిగే సమయంలో వర్షభావం నెలకొంది. ఈ పరిస్ధితిల కారణంగా వేరుశ నగ పంట నిలువునా ఎండుతోంది. వారంలో రోజుల్లో వర్షం కరవక పోతే పంట చేతికొచ్చే పరిస్ధితులు కన్పించడం లేదని అన్నదాతలు వాపోతున్నారు.

భారీగా తగ్గిన వేరుశనగ పంట సాగు

ఈ ఏడాది ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగు భారీగా తగ్గిపోయింది. ప్రతి ఏటా రైతన్నలు నష్టాలు చవిచూస్తుండడంతో వేరుశనగ పంట సాగు చేయడం వదిలేశారు. 2022 ఖరీప్‌లో భారీ వర్షాల కారణంగా పంట చేతికందలేదు. 2023లో తొలుత అదునులో వర్షాలు పడ్డాయి. దీంతో వేరుశనగ పంటను కోటి ఆశలతో సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చే సమయంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో నిలువునా ఎండిపోయాయి. దీంతో రైతులు పంటను నష్టపోయారు. వరుసగా నష్టాలు వస్తుండడంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో గత ఏడాది కంటే తక్కువగా సాగు చేశారు. ఇప్పుడు కూడా కాయలు దిగే సమ యంలో వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయి. వర్షం కురవకపోలే ఈ ఏడాది కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

పంట నిలువునా ఎండుతోంది

మూడు ఎరకాల్లో వేరుశనగ పంట సాగు చేశా ను. దీనికి గానూ రూ.40వేలకుపైగా ఖర్చు అయ్యింది. వర్షాలు సకాలంలో కురవడంతో పంట చేతికొస్తుందని ఆశలు పెట్టుకున్నాను. చెట్లు ఏపుగా పెరిగాయి. కాయలు దిగే సమ యంలో వర్షం పడడంలేదు. వర్షం కురవక పోతే పంట చేతికొచ్చే అవకాశాలు ఉండవు. ఇప్పుడు వాన రాక పంట ఎండిపోతోంది.

-వనజమ్మ, పర్తికోట, ములకలచెరువు మండలం

వారం రోజుల్లో వర్షం పడకపోతే తీవ్ర నష్టం

మూడు ఎకరాల్లో పంట సాగు చేశాను. రూ.30వేలు ఖర్చు వచ్చింది. వానరాకపోవడంతో కళ్ళ ముందు వేరుశనగ పంట ఎండుతుంటే గుండె తరుక్కుపోతోంది. విత్తనాలు విత్తే సమయం నుంచి వాన పడింది. గత ఏడాది పంట సా గు చేసి నష్టపోయాను. ఇప్పుడు కూడా వర్షా భావ పరిస్ధితులు నెలకొనడంతో పంట చేతి కొస్తుందో లేదోనన్న భయం నెలకొంది. వరణ దేవుడు కరుణించాలి.

-వెంకటరమణ, చిటికివారిపల్లె, ములకలచెరువు మండలం

Updated Date - Sep 15 , 2024 | 11:29 PM