అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
ABN , Publish Date - Sep 02 , 2024 | 11:42 PM
గ్రామా ల్లో పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉం డాలని ఎమ్మెల్యే షాజహానబాషా ఆదే శించారు.
మదనపల్లె టౌన, సెప్టెంబరు 2: గ్రామా ల్లో పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉం డాలని ఎమ్మెల్యే షాజహానబాషా ఆదే శించారు. సోమవారం ఎమ్మెల్యే నివాసం వద్ద మూడు మండలాలు, పట్టణంలోని పంచాయతీ కార్యదర్శులు, సచివాలయాల కార్యదర్శులు, వైద్య సిబ్బంది, ఆర్‌డబ్ల్యూ ఎస్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వారంలో రెండు రోజులు అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రజాసమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి గ్రామంలో ఫీవర్ సర్వే నిర్వహించడంతో పాటు, దోమల నివారణకు ఫాగింగ్ చేయించాలన్నారు. వీధిదీపాలు, మౌలిక వసతుల కల్పనకు అధికారులు కృషి చేయాలన్నారు. గ్రామ పంచాయతీల్లో జనరల్ ఫండ్‌కు తోడు 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చుచేస్తూ తాగునీటి పథకాలను నిర్వహించాలన్నారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల మంజూరుకు కొందరు డబ్బు లు డిమాండ్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఇలా రైతులు ఫిర్యాదులు చేస్తే రెవె న్యూ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎంపీడీవోలు భానుప్రసాద్, రమేశ, తహసీల్దార్‌లు నిర్మలాదేవి, దనంజేయులు, అధికారులు పాల్గొన్నారు.