Share News

Amaravati: విదేశీ మద్యం ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీ

ABN , Publish Date - Oct 13 , 2024 | 10:24 AM

రాష్ట్రంలో మద్యం దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారం రాత్రి 7.00 గంటలకు ముగిసింది. ఈ నేపథ్యంలో మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం షాపులున్నాయి. ఈ షాపుల కోసం గురువారం అర్థరాత్రి వరకు 65,424 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి.

Amaravati: విదేశీ మద్యం ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీ

అమరావతి: భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం(IMFL) బాటిల్ ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీ (Privilege Fee) విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. దాన్ని రాష్ట్ర గవర్నర్ ఆమోదం (Governor Approval) మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) అన్ గెజిట్ నోటిఫికేషన్ (Un Gazetted Notification) విడుదల చేశారు. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీ ధరలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు. బాటిల్ ఎమ్మార్పీ ధర రూ.150.50 గా ఉంటే దాన్ని రూ. 160 కు ప్రివిలేజ్ ఫీజు పెంచారు. దాంతో క్వార్టర్ బాటిల్ ధర రూ.90.50 గా ఉంటే ఎపిఎఫ్ కలిపి దాని ధర రూ రూ.100 అవుతుందని వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్వార్టర్ బాటిల్ ధర రూ. 99 కే నిర్ధారించినందున రూ. 100 ధరలో రూ.1 మినహాయించి విక్రయిస్తారని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.

రాష్ట్రంలో మద్యం దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారం రాత్రి 7.00 గంటలకు ముగిసింది. ఈ నేపథ్యంలో మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం షాపులున్నాయి. ఈ షాపుల కోసం గురువారం అర్థరాత్రి వరకు 65,424 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ఈ మద్యం దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1,308 కోట్ల మేర ఆదాయం వచ్చింది. అయితే ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా మద్యం షాపుల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.


ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 113 మద్యం షాపుల కోసం 4,839 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో మొత్తం 40 మద్యం దుకాణాలున్నాయి. వాటికి కేవలం 869 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. యూఎస్, యూరప్‌ నుంచి 20 దరఖాస్తులు అందాయని ఉన్నతాధికారులు వివరించారు. కాగా ఈ నెల 14వ తేదీన అధికారులు మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది.


కాగా గత వైసీపీ సర్కారు నాసిరకం మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల అయిదేళ్ల పాటు విక్రయించి మందుబాబుల ఆరోగ్యంతో చెలగామాడింది. అధిక ధరల తో అప్పటి ప్రభుత్వ పెద్దలు వేలకోట్లు అడ్డంగా పోగేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇటీవల ఈ విధానానికి మంగళం పాడి మళ్లీ ప్రైవేటు మద్యం దుకా ణాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మద్యం దుకాణాలను లాటరీ విధానంలో కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వీటిపై ఎక్కడికక్కడ కూటమిపార్టీ నేతలతోపాటు వైసీపీకి చెందిన పలువురు నేతలు కన్నేసి వీటిని చేజిక్కించుకునేందుకు నయానా భయానా బెదిరిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ మనుషుల ద్వారా దరఖాస్తులు చే యించినా లాటరీలో షాపు తగు లుతుందో లేదోనన్న భయంతో దరఖాస్తుదారులను దారికి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎవరు దరఖాస్తులు చేశారో, చేయబోతున్నారో గుర్తించి పిలిపించి సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. లాటరీలో షాపు వస్తే అందులో పాతికశాతం వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. తన వాటా కింద పాతికశాతం వాటాగా పెట్టుబడి డబ్బులు ఇచ్చేస్తామని బేరాలకు దిగుతున్నారు. ఇలా జిల్లాలో నాలుగు నియోజక వర్గాల్లో ఈతరహా బెదిరింపులు అధికంగా ఉంటున్నాయి. నేరుగా ఎమ్మెల్యేలు, వారి తనయులు, అనుచరులు సిండికేట్‌తో కలిసి వాటాల కోసం ప్రయత్నిస్తున్నారు. కొం దరైతే వాటా ఇస్తే ఆ తర్వాత ఎమ్మార్పీ ఉల్లంఘనలు జరిగినా అధికారులు జోలికి రాకుండా చూసుకుంటామనే హామీలతో పంతం నెరవేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు.

నియోజకవర్గ, మండల కేంద్రాల్లో వ్యాపారం ఎ క్కువ జరిగే దుకాణాల విషయంలో ఈ తరహా ఒత్తిళ్లు అధికంగా చేస్తున్నా రు. తునిలో ఏకంగా అక్కడ కూటమి నేతలు ఎక్సైజ్‌ స్టేషన్‌ ఎదుట మను షులను నియమించి దరఖాస్తుదారులపై నిఘా పెడుతున్నారు. హైవేను ఆనుకుని ఉన్న ఓ నియోజకవర్గంలో పాతికశాతం వాటా ఇవ్వాల్సిందేనని ముందే దరఖాస్తుదారుల వద్ద కర్చీఫ్‌ వేసేశారు. జిల్లాలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలైతే అందరికంటే అధికంగా వ్యాపారం తమ నియోజకవర్గాల్లో నే జరుగుతాయనే లెక్కలతో సాధ్యమైనన్ని ఎక్కువదుకాణాల్లో పాగా వేయడానికి పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. లిక్కర్‌ సిండికేట్‌లో ఎవ రెవరు దరఖాస్తులు చేయడానికి అవకాశం ఉందో గుర్తించి కబురంపి తమ డిమాండ్‌లు ముందుంచుతున్నారు. ప్రైవేటు మద్యం దుకాణా ల విషయంలో కూటమి ఎమ్మెల్యేలు కొందరు బరితెగించి వ్యవహరి స్తున్న వైనంపై సీఎం చంద్రబాబు తాజాగా స్పందించారు. మద్యం దరఖాస్తుల్లో జోక్యం చేసుకునే ప్రజాప్రతినిధులను సహించేది లేద ని హెచ్చరించారు. పొలిటికల్‌ గవర్నెన్స్‌ అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదని, మంచిపేరు తేవడమని ఎమ్మెల్యేలు తెలుసుకోవా లంటూ హెచ్చరించారు. దీంతో ఇప్పుడు కొందరు ఎమ్మెల్యేల్లో చంద్రబాబు హెచ్చరికలు గుబులు పుట్టిస్తున్నాయి. మద్యంషాపులను దక్కించుకోవడానికి వైసీపీ నేతలు సైతం అడ్డదారులకు దిగుతున్నారు. వైన్‌షాపులు దక్కించుకున్న వారు రద్దీ ప్రాంతాల్లో దుకాణాలు తెరవడానికి వీల్లేకుండా వాటిని అద్దెపేరుతో అగ్రిమెంట్‌ చేసుకుని వాటిని ఇప్పటికే చేతుల్లోకి తీసేసుకున్నారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, ఆయన అనుచరులు 30దుకాణాలను ఇలా రాయించేసుకున్నారు. పె ద్దాపురం, సామర్లకోట, కాకినాడరూరల్‌లోను ఇలానే దుకాణాలను గుప్పిట్లో ఉంచు కుని లాటరీ దక్కించుకున్నవారివద్ద వాటా కొట్టేయడానికి పావులు కదుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ..

ఓటమి అనేక పాటలు నేర్పిస్తుంది: జగ్గారెడ్డి

బన్నీ ఉత్సవంలో 50 మందికి పైగా గాయాలు..

సీఎం చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ట్వీట్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 13 , 2024 | 10:25 AM