CM Chandrababu: సచివాలయం చేరుకున్న సీఎం చంద్రబాబు.. అమరావతిపై కాసేపట్లో శ్వేతపత్రం విడుదల
ABN , Publish Date - Jul 03 , 2024 | 11:53 AM
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. ఈరోజు అమరావతిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని మొదటి దశ పనులను గతంలో టీడీపీ హయాంలోనే తుదిదశకు చేరుకున్నాయి.
అమరావతి, జూలై 3: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కాసేపటి క్రితమే ఏపీ సచివాలయానికి (AP Secretariat) చేరుకున్నారు. ఈరోజు అమరావతిపై (Amaravathi) సీఎం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని మొదటి దశ పనులను గతంలో టీడీపీ (TDP) హయాంలోనే తుదిదశకు చేరుకున్నాయి. అయితే అమరావతిపై కక్షకట్టిన జగన్ ప్రభుత్వం (Jagan Government)... ప్రభుత్వ పెద్దలు, రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారితో అమరావతి శ్మశానం, ఎడారి అంటూ వ్యాఖ్యలు చేయించిన విషయం తెలిసిందే. ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో రాజధానిపై (Capital) బురదజల్లే ప్రయత్నం చేశారు. ఇదే వంకతో అసైన్డ్ రైతులకు(Farmers) కౌలు నిలిపివేశారు.
AP Politics: నెల రోజులు కాకుండానే ఎదురుదాడి.. వైసీపీ నేతలకు ఏమైంది..?
దీంతో గడిచిన రెండేళ్లుగా రాజధాని రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. రాజధాని ప్రాంతంలో మట్టి, ఇసుక, కంకర, నిర్మాణ సామాగ్రి యదేచ్చగా చోరీలు జరిగాయి. రాజధాని కోసం భూములు ఇచ్చనందుకే తమపై గత ప్రభుత్వం వేలాది కేసులు పెట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 250 మంది వరకూ రాజధాని ఉద్యమంలో ఆవేదనతో రైతులు అసువులుబాశారు. అమరావతిపై హైకోర్టు (AP High Court) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా జగన్ సర్కర్ స్పందించలేదు. ఐదేళ్లకు ముందు అమరావతి ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణాలు జరిగే చోట పని ప్రారంభించడానికి కంప చెట్లు ప్రధాన అడ్డంకిగా మారాయి. తక్షణం కంప చెట్ల తొలగింపు కార్యక్రమం ప్రారంభించాలని రైతులు విజ్జప్తి చేశారు.
Congress: ఇవాళ రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక
తొలిదశ పనుల కోసం సుమారు రూ.8 వేల కోట్లకు పైగా అప్పటి ఏపీ సర్కార్ (AP Government) ఖర్చు చేసింది. అమరావతిలో దాదాపు పూర్తయిన భవనాలను ముందుగా పూర్తిచేసి రోడ్లు, విద్యుత్, తాగునీరు కల్పించడమే ముందున్న విధిగా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అమరావతి నిర్ణయం, బీజం, ప్రధాని రాక, నిర్మాణంలో పురోగతి, ప్రభుత్వ మార్పు, రైతుల ఉద్యమం, తిరిగి ఎన్డీఏ ప్రభుత్వ రాకలను చంద్రబాబు తన శ్వేతపత్రంలో వివరించనున్నారు. అమరావతిపై తమ ప్రణాళికలను కూడా నేటి శ్వేతపత్రంలో వివరించే అవకాశం ఉంది. నేటి సాయంత్రం ఢిల్లీ వెళుతున్నందున కేంద్ర పెద్దల వద్ద అమరావతి, పోలవరం సహ విభజన హమీలు విషయాలను ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది. రైతులు, మహిళల ఉద్యమాన్ని ప్రత్యేకంగా శ్వేతపత్రం సందర్బంగా సీఎం చంద్రబాబు ప్రస్తావించనున్నారు.
ఇవి కూడా చదవండి...
Nokia Team: సీఎం రేవంత్ రెడ్డితో జర్మనీ ప్రతినిధుల భేటీ
Hyderabad: కాకాగూడలో కలకలం.. మూడు మూగజీవాలపై కట్టర్‌లతో దాడి
Read Latest AP News AND Telugu News