Share News

AP Govt: ఏపీ మహిళా కమిషన్‌ చైర్మన్‌ను వెంటనే తొలగించండి.. ప్రభుత్వం ఆదేశాలు

ABN , Publish Date - Sep 24 , 2024 | 02:10 PM

Andhrapradesh: ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ గజ్జెల లక్ష్మికి ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆమె పదవి కాలం ఆగస్టులోనే ముగియడంతో వెంటనే తొలగించాలని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం నాడు సంబంధిత శాఖకు ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

AP Govt: ఏపీ మహిళా కమిషన్‌ చైర్మన్‌ను వెంటనే తొలగించండి.. ప్రభుత్వం ఆదేశాలు
AP Government

అమరావతి, సెప్టెంబర్ 24: ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ గజ్జెల లక్ష్మికి (AP Women Commission Gajjela Laxmi) ప్రభుత్వం (AP Govt) ఉద్వాసన పలికింది. ఆమె పదవి కాలం ఆగస్టులోనే ముగియడంతో వెంటనే తొలగించాలని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం నాడు సంబంధిత శాఖకు ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఈరోజు ఉదయం గజ్జెల లక్ష్మి ప్రకటించారు. ఆమెకు నిన్ననే ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. చైర్మన్‌కు ఉద్వాసన పలకడంతో సభ్యుల పదవి కాలం పూర్తి అయినట్టే అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


గతంలో ఇలా..

కాగా.. ముంబై నటి కాదాంబరి జెత్వాని కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ గతంలో గజ్జెల లక్ష్మీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర రాష్ట్రాల మహిళల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, ఆమె ముంబయికి చెందిన మహిళ కాబట్టి మహరాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించాలంటూ వెంకటలక్ష్మి ఇచ్చిన ఉచిత సలహాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల మహిళల విషయంలో తాము సుమోటోగా కేసు తీసుకోలేమంటూ ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ చెప్పిన మాటలతో దుమారం చెలరేగింది.

HYDRA: బ్యాంకు లోన్లపై హైడ్రా సంచలన నిర్ణయం



ఉన్నత చదువులు చదివిన కాదంబరి ముందుగా ఏపీ మహిళా కమిషన్‌ను ఎందుకు ఆశ్రయించలేదని బాధితురాలిపైనే ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ప్రశ్నలు సంధించడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. "మహిళకు అన్యాయం జరిగితే మాకు సంబంధం లేదని అంటావా. ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి నువ్వు మాయని మచ్చ. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్నికలకు ముందు నీకు పదవి వరించింది. వైసీపీ నాయకుల తప్పులు మీకు కనిపించడం లేదా?. ఇతర రాష్ట్ర మహిళలకు మన రాష్ట్రంలో అన్యాయం జరిగితే మహిళా కమిషన్‌కు సంబంధం లేదని అంటారా?. నీ పదవీ కాలం ఇంకో సంవత్సరం ఉంది. ఈ యేడాది పాటు వైసీపీ నాయకులు మహిళలను వేధిస్తే ఇలానే ఏదో ఒక వంక పెట్టుకుని వారిని రక్షిస్తావు. ఇలాంటి క్రిమినల్స్‌ను వెనకేసుకు రావడం వైసీపీలో సంప్రదాయంగా మారింది. మేము ట్యాక్సులు కట్టిన డబ్బుతో నీకు ప్రభుత్వం లక్షలు లక్షలు జీతం ఇవ్వడం లేదా?. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని అసభ్య పదజాలంతో తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తావు. మా నుంచి రియాక్షన్ వస్తే టీడీపీ సోషల్ మీడియాపై కేసులు పెడతావు. మళ్లీ మీ పార్టీ 2029లో గెలిస్తే ఇలాంటి నేరస్థులనే ఇంకా పెంచి పోషిస్తుంది" అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి..

Narayana: కల్తీ నెయ్యికి ప్రధాన కారకుడు జగనే..

Anam RamnarayanaReddy: టీటీడీ పాలకమండలి నియామకం ఎప్పుడో చెప్పిన మంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 24 , 2024 | 02:16 PM