Peethala sujatha: విశ్వంలో ఎక్కడున్నా పట్టుకొస్తాం.. వాళ్లకు టీడీపీ నేత స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Nov 09 , 2024 | 04:37 PM
Andhrapradesh: వైసీపీ నేతలపై మాజీ మంత్రి పీతల సుజాత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సప్తసముద్రాలు దాటి వారిని వెతికి తీసుకువచ్చి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వర్రా రవీంద్రెడ్డి వైసీపీ సైకో అని.. ఇలాంటివారు ఇంకా చాలా మంది ఉన్నారన్నారు.
అమరావతి, నవంబర్ 9: వైసీపీ పాలనలో 2,04,414 నేరాలు ఘోరాలు, అత్యాచారాలు జరిగాయని మాజీ మంత్రి పీతల సుజాత (Former Minister Peethala Sujatha) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... మహిళలను వ్యక్తిత్వ హననం చేస్తూ వల్గర్ పోస్టులు పెట్టిన, పెడుతున్న జగన్ ముఠాని వదిలిపెట్టేదిలేదని స్పష్టం చేశారు. వైసీపీ పాపాల పుట్ట బద్దలైందని... ఒక్కొక్క పాము ఆ పుట్టలోంచి బయటికి వస్తున్నాయన్నారు.
CM Chandrababu: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
చిన్న చేపల వెనుక ఉన్న పెద్ద తిమింగలాలపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్రా రవీంద్రెడ్డి వైసీపీ సైకో అని.. ఇలాంటివారు ఇంకా చాలా మంది ఉన్నారన్నారు. వర్రా రవీంద్ర రెడ్డి వెనుక ఎవరున్నారో తెలియాలన్నారు. వర్రా రవీంద్రరెడ్డికి శాలరీ ఎక్కడి నుంచి వచ్చేదో సమగ్ర వివరాలు సేకరిస్తామని... తప్పక విచారణ జరిపిస్తామని వెల్లడించారు. ప్యాలెస్‌లో కూర్చున్న పెద్ద పెద్ద తిమింగలాలను వదిలిపెట్టేది లేదన్నారు.
జగన్ పాలనతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో మహిళలపై నేరాల సంఖ్య 25 శాతం తగ్గాయన్నారు. రాబోయే రోజుల్లో నేరాల సంఖ్య తగ్గించడమే చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని.. వైసీపీ ఆగడాలు ఇకసాగవన్నారు. తప్పు చేసినవారు సప్త సముద్రాల వెనుక దాక్కున్నా సరే బయటికి తెస్తామని.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలకు వైసీపీ ప్రభత్వంలో విచ్చలవిడిగా వదిలిన గంజాయి, డ్రగ్సే కారణమని.. ఈ పాపం వైసీపీదే అంటూ పీతల సుజాత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వర్రాకు వారి వల్లే ప్రమాదం: బీటెక్ రవి
మరోవైపు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డి గురించి కడప జిల్లా పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి కూడా సంచలన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన కేసులో అరస్ట్ అయ్యి తప్పించుకుపోయిన రవీంద్రారెడ్డికి వైసీపీ నేతల వల్లే ప్రమాదం పొంచి ఉందని ఆరోపణలు చేశారు. పారిపోయిన అతనికి హాని కలిగించి ఆ నెపాన్ని ఏపీ పోలీసులు, కూటమి ప్రభుత్వంపై నెట్టాలని వారు చూస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితపై తప్పుగా ప్రచారం చేసిన కేసులో రవీంద్రారెడ్డి.. కడప పోలీసుల నుంచి తప్పించుకుని పోయారని... అయితే కడప పోలీసులే అతన్ని తప్పించారనే తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నారు.
అయితే నిన్న (శుక్రవారం) రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారంటూ వైసీపీ నేతలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టారని... నేడు మళ్లీ అరెస్టు కాలేదంటున్నారన్నారు. తప్పించుకున్నాడంటూ పోస్టులు పెట్టారని.. దీన్ని బట్టి చూస్తే వైసీపీ పెద్ద కుట్ర చేస్తున్నట్లు అర్థమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఫ్యాన్ పార్టీకి రాజకీయ ప్రయోజనం కలుగుతుందంటే ఆ పార్టీ నేతలు ఎంతటి నీచానికైనా, దుర్మార్గానికైనా పాల్పడతారంటూ ధ్వజమెత్తారు. ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన పీఏ రాఘవరెడ్డికి వర్రా రవీందర్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయని అన్నారు. రాఘవరెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తే అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని బీటెక్ రవి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Borugadda Anil: పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్
Trump Tower: హైదరాబాద్‌లో ట్రంప్ టవర్లు
Read Latest AP News And Telangana News