Andhra Pradesh:నడిరోడ్డుపై వదిలేశారు.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం..
ABN , Publish Date - Oct 20 , 2024 | 10:30 AM
మార్గ మధ్యల్లో ప్యాసింజర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ తమ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తుండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ బయలుదేరిన నవీన్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు విశాఖలో ప్రయాణీకులను ఎక్కించుకుని హైదరాబాద్ వస్తుండగా బస్సులో ఏసీ పనిచేయకపోవడంతో ..
నిర్లక్ష్యానికి నిదర్శంగా మారుతున్నాయి కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్. వేలకు వేల రూపాయిలకు టికెట్ కొన్న ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బస్సు యాజమాన్యాలు తమ బాధ్యత నుంచి పక్కకు తప్పుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎన్నో చూస్తున్నాం. బస్సులో సరైన సౌకర్యాలు కల్పించకపోవడం, అపరిశుభ్రంగా ఉండటం, రిపేర్లున్న బస్సుల్లో ప్రయాణీకులను ఎక్కించుకుని, మార్గ మధ్యల్లో ప్యాసింజర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ తమ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తుండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ బయలుదేరిన నవీన్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు విశాఖలో ప్రయాణీకులను ఎక్కించుకుని హైదరాబాద్ వస్తుండగా బస్సులో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణీకులు నానా అవస్థలు పడ్డారు. కొన్ని కుర్చీలు విరిగిపోయి ఉండటంతో సరిగ్గా కూర్చోలేని పరిస్థితి నెలకొంది. ఏసీ బస్సు టికెట్ కొనుగోలు చేస్తే.. ఏసీ రిపేర్ అంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు మార్గ మధ్యలో ఆపి తరచూ రిపేర్లు చేయడంతోనూ ప్యాసింజర్లు ఎన్నో అవస్థలు పడ్డారు. చివరకు విజయవాడలో మరో బస్సు ఏర్పాటుచేస్తామని చెప్పిన బస్సు యాజమాన్యం.. విజయవాడ బెంజి సర్కిల్‌లో ప్రయాణీకులందరినీ దించి చేతులు దులుపుకుంది. దీంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.
ప్యాసింజర్ల ఆందోళన
విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు కొందరు ప్రయాణీకులు నవీన్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో ఏసీ టికెట్లు బుక్ చేసుకున్నారు. విశాఖ నుంచి బయలుదేరిన బస్సులో ఏసీ పనిచేయడం మానేసింది. అలాగే బస్సులో కుర్చీలు విరిగిపోయి ఉండటంతో ప్రయాణీకులు కూర్చోవడానికి ఇబ్బంది పడ్డారు. ప్రయాణీకులు బస్సు డ్రైవర్‌ను ప్రశ్నించడంతో మధ్యమధ్యలో బస్సు ఆపి మరమ్మతులు చేస్తూ తీసుకువచ్చారు. చివరకు విసుగుచెందిన ప్రయాణీకులు హనుమాన్ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో విజయవాడలో మరో బస్సు ఏర్పాటు చేస్తామని ప్రయాణీకులకు హామీ ఇచ్చారు. విజయవాడ బెంజ్ సర్కిల్ చేరుకున్న తర్వాత ప్రయాణీకులను బస్సు నుంచి దించివేసి, మరో బస్సు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని బస్సు యాజమాని చెప్పడంతో ప్రయాణీకులంతా మరోసారి ఆందోళనకు దిగారు. వేల రూపాయిలు తీసుకుని తమను నడిరోడ్డుపై వదిలేశారని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను మోసం చేసిన బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని అధికారులను ప్రయాణీకులు వేడుకుంటున్నారు.
CM Revanth Reddy: నాడు కలవని వాళ్లు నేడు పిలుస్తున్నారు..
తరచూ ఘటనలు..
ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణీకులను ఇబ్బందులు పెడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. టికెట్ కొన్న తర్వాత బస్సులో ఏదైనా సమస్య వస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, ప్రత్యామ్నాయంగా బస్సు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణీకులు సకాలంలో గమ్య స్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఘటనలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇలా చేయండి
Read More Latest Telugu News Click Here