Amaravati: నేడు ఛలో అసెంబ్లీకి సర్పంచ్‌ల పిలువు
ABN , Publish Date - Feb 06 , 2024 | 07:15 AM
విజయవాడ: సమస్యల పరిష్కారం కోరుతూ సర్పంచ్‌ల సంఘం మంగళవారం ఛలో అసెంబ్లీకి పిలుపిచ్చింది. దీంతో పోలీసులు సర్పంచ్‌లను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ విజవయాడలో మీడియాతో మాట్లాడుతూ..
విజయవాడ: సమస్యల పరిష్కారం కోరుతూ సర్పంచ్‌ల సంఘం మంగళవారం ఛలో అసెంబ్లీకి పిలుపిచ్చింది. దీంతో పోలీసులు సర్పంచ్‌లను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ విజవయాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఛలో అసెంబ్లీకి’ రెండు రోజుల ముందే సర్పంచ్‌లను అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని.. సర్పంచ్‌ల ‘చలో అసెంబ్లీని’ నిర్వహించితీరుతామని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం, గ్రామీణ ప్రజల, సర్పంచ్‌ల న్యాయబద్ధమైన 16 డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
కాగా నేడు సర్పంచ్‌లు తలపెట్టిన ఛలో అసెంబ్లీకి ఎలాంటి అనుమతులు లేవని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకొని, కొన్ని అసాంఘిక శక్తులు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా అనుమతులు లేవని చెప్పారు. పోలీసు చట్టం 30 అమలులో ఉందని ఎస్పీ స్పష్టం చేశారు.