Share News

Sports News: క్రీడాకారునికి రూ. లక్ష ఆర్థికసాయం చేసిన పారిశ్రామికవేత్త

ABN , Publish Date - May 19 , 2024 | 11:40 AM

అవనిగడ్డ, (కృష్ణాజిల్లా): అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు కొల్లాటి అశోక్ కుమార్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్.. రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు.

Sports News:  క్రీడాకారునికి రూ. లక్ష ఆర్థికసాయం చేసిన పారిశ్రామికవేత్త

అవనిగడ్డ, (కృష్ణాజిల్లా): అంతర్జాతీయ బాక్సింగ్ (International Boxing) క్రీడాకారుడు కొల్లాటి అశోక్ కుమార్‌ (Kollati Ashok Kumar)కు ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ (Vikkurthy Srinivas) రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. థాయిలాండ్‌ (Thailand)లో మార్చిలో జరిగిన ముయ్థాయి బాక్సింగ్ వరల్డ్ చాంపియన్ షిప్‌లోఅశోక్ కుమార్.. గోల్డ్ మెడల్ సాధించారు. వచ్చే నెల నార్త్ అమెరికాలో జరగనున్న మరో ప్రపంచ పోటీకి అశోక్ కుమార్ హాజరు అవుతున్నారు.


ప్రభుత్వం నుంచి సహకారం లేక పోవడంతో తన వంతు సాయంగా విక్కుర్తి శ్రీనివాస్.. లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. మత్స్యకార గ్రామం నుంచి ప్రపంచ స్థాయి బాక్సర్‌గా తయారు కావడం పట్ల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. బాక్సర్ అశోక్ కుమార్ గుంటూరు జిల్లా, నిజాంపట్నం వాసి అని, అతని తల్లి స్వగ్రామం ఎదురుమొండి కావడం ఈ ప్రాంతానికి గర్వకారణమని శ్రీనివాస్ అన్నారు. దివిసీమలో క్రీడలను ప్రోత్సహిస్తామని శ్రీనివాస్ వ్యాయామోపాధ్యాలకు హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భర్తపై దాడి.. భార్య ప్రతీకారం..

కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..

తమిళనాడులో ‘రెడ్ అలర్ట్’ జారీ

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 19 , 2024 | 11:57 AM