Share News

వైసీపీకి భారీ షాక్‌

ABN , Publish Date - Apr 01 , 2024 | 12:27 AM

బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. వివిధ గ్రామాలకు చెందిన 95 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.

వైసీపీకి భారీ షాక్‌
టీడీపీలో చేరిన వారితో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి

మాజీ ఎమ్మెల్యే బీసీ సమక్షంలో టీడీపీలో చేరిన 95 కుటుంబాలు

బనగానపల్లె, మార్చి 31: బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. వివిధ గ్రామాలకు చెందిన 95 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదివారం బనగానపల్లె మండలం రామతీర్థం గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన 50 కుటుంబాలు బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వారిలో వైసీపీకి చెందిన చాగలమర్రి రామకృష్ణుడు, చాగలమర్రి రమణ, తుపాకుల ప్రసాద్‌, సుధాకర్‌ పోలంశేఖర్‌, కోవెలకుంట్ల ఆజాం, సూలం వెంకటేశ్వర్లు, ముల్లామాలి, ముల్లా మహమ్మద్‌ గౌస్‌, దోరాశి శ్రీను, కందుకూరు భాస్కర్‌రేవననూరు పెద్దహు సేన్‌సా, మర్రి చిన్న మద్దిలేటి, మదనగోపాల్‌, మద్దయ్య, షేక్‌ అబ్బాస్‌, ఈడిగ రామాంజనేయులు, చాకలి ఆంజనేయులు, ఈశ్వరయ్య, నరసింహులు, పెద్ద వలి, హుసేనప్ప, డొల్లు జంగమయ్య, గోపాల్‌ ఉన్నారు. బీసీ వీరికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. అలాగే కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లె వైసీపీకి చెందిన 25 కుటుంబాలు బనగానపల్లె టీడీపీ కార్యాల యంలో బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వారిలో వైసీపీకి చెందిన అంకెల బాస్కర్‌రెడ్డి, కోనశివశంకర్‌రెడ్డి, కోనభారతి, క్రిష్టిపాటి అరునాదేవి, మల్లికాదేవి, పుష్పావతి, వలి, సుకుర్‌భాష, మక్కల వెంకటరాముడు, గోగుల రామంచంద్ర, మంజుల, బోయ వెంకటాంజనేయులు, గోగుల చంద్ర, ప్రభావతి,సిద్దయ్య, క్రిస్టిపాటి మద్దయ్య, బోయరఘురాం ఉన్నా రు. ఈసం దర్భంగా బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ కలసికట్టుగా పనిచేసి సీఎంను చంద్రబాబు చేసుకుందామన్నారు. అలాగే బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేటకు చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో పార్టీలో చేరారు. ఇల్లూరుకొత్తపేటకు చెందిన జూని యర్‌ జగన్‌, (సయ్యద్‌ చాంద్‌బాషా), అలహుసేన్‌, నాదలి,సుభాస్‌, జహంగీర్‌ బాషా, శివరమమూర్తి, లాలు, శ్రీను, పాంషావలి, బాషా, రహ్మతుల్లా, కార్పెం టర్‌ మహమ్మద్‌, వెల్డింగ్‌ ఖాశీం, సాయిబాబ, దొడియంఖాశీం, తలారి మధు, నగేంద్ర, దస్తగిరి తదితరులు పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వారు మాట్లాడుతూ చంద్రబాబుసూపర్‌ సిక్స్‌ పథకాలతోనే ఏపీకి నిజమైన సంక్షే మం వస్తుందన్నారు. టీడీపీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పి స్తా మని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

Updated Date - Apr 01 , 2024 | 12:27 AM