Share News

YCP: బుగ్గన వర్గానికి మహిళల నుంచి ఊహించని పరిణామం..

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:10 PM

డోన్ (కర్నూలు): మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన కుమారుడు అమర్ నాథ్ అర్జున్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలోకి దించారు. ఇటీవల జలదుర్గం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు స్థానిక మహిళల నుంచి ఊహించని పరినామం ఎదురైంది.

YCP:  బుగ్గన వర్గానికి మహిళల నుంచి ఊహించని పరిణామం..

డోన్ (కర్నూలు): మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) తన కుమారుడు అమర్ నాథ్ అర్జున్ రెడ్డి (Amarnath Arjun Reddy)ని ఎన్నికల ప్రచారంలోకి (Election Campaign) దించారు. ఇటీవల జలదుర్గం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు స్థానిక మహిళల (Womens) నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను (Water Problem) పరిష్కరించకుండా ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగానికి వచ్చారని మహిళలు నిలదీయడంతో ఖంగుతిన్నారు. సమస్య గురించి ఎమ్మెల్యేకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తామని మంత్రి తనయుడు చెప్పినా గతంలో బుగ్గన కూడా ఇలానే చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అర్జున్ రెడ్డి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ఈ పరిణామంతో బుగ్గన వర్గం టెన్షన్ పడుతోంది. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎన్నికల్లో ప్రభావం తప్పదేమోనని మదనపడుతోంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Apr 05 , 2024 | 01:13 PM