Dengue: కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరులో డెంగ్యూ కలకలం
ABN , Publish Date - Feb 01 , 2024 | 10:24 AM
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరులో డెంగ్యూ కలకలం రేగింది. పట్టణంలోని ఎస్పీ కాలనీలో అశోక్ అనే వ్యక్తిని పరీక్షించిన వైద్యులు డెంగ్యూగా నిర్దారణ చేశారు. దీంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరులో డెంగ్యూ కలకలం రేగింది. పట్టణంలోని ఎస్పీ కాలనీలో అశోక్ అనే వ్యక్తిని పరీక్షించిన వైద్యులు డెంగ్యూగా నిర్దారణ చేశారు. దీంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సీ కాలనీలో పారిశుధ్యం లోపించినా.. మునిసిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పట్టించుకోవడంలేదు. దీంతో కాలనీ వాసులు భయందోళన చెందుతున్నారు.
కాగా డెంగ్యూ జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, వికారం వంటి లక్షణాలతో ప్రారంభమవుతాయి. దోమ కాటును నివారించేందుకు పూర్తిగా చేతులకు బట్టలు ధరించాలి. నిద్రపోతున్న సమయంలో దోమలు కుట్టకుండా దోమతెరలాంటివి ఉపయోగించి జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో, ఇంటి చుట్టూ పరిశుభ్రత పాటించాలి. ఇంటి ఆవరణలో మురుగు నీరు లేకండా చూసుకోవాలి. తెరిచిన తలుపులు, కిటికీల నుంచి కూడా దోమలు వస్తాయి. అలా రాకుండా కిటికీ తలుపులు మూసివేయాలి. ఈ విధంగా చేసినట్లయితే కొంతవరకు దోమలు ఇంట్లోకి రాకుండా నివారించవచ్చు.