Share News

‘వైసీపీ రంగులు వేయడం సరికాదు’

ABN , Publish Date - Mar 07 , 2024 | 12:54 AM

నంద్యాల పట్టణంలో మున్సిపల్‌ కార్యా లయం ఎదురుగా స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ను కించపరిచే విధంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్థూపానికి వైసీపీ రంగులు వేయడం, శిల్పా పేరును పెట్టడం తగదని ముస్లిం ఫెడరేషన్‌ నాయకులు ధ్వజమెత్తారు.

‘వైసీపీ రంగులు వేయడం సరికాదు’
ధర్నా చేస్తున్న ముస్లింలు

నంద్యాల టౌన్‌, మార్చి 6: నంద్యాల పట్టణంలో మున్సిపల్‌ కార్యా లయం ఎదురుగా స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ను కించపరిచే విధంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్థూపానికి వైసీపీ రంగులు వేయడం, శిల్పా పేరును పెట్టడం తగదని ముస్లిం ఫెడరేషన్‌ నాయకులు ధ్వజమెత్తారు. బుధవారం స్థూపం ఎదుట ధర్నా చేశారు. ఫెడరేషన్‌ నాయకులు బాబాఫకృద్దీన్‌, సలాం, సోహెల్‌ రాణా, మహాబూబ్‌బాషా, సద్దాం, నూర్‌బాషా, తదితరులు మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా అబుల్‌ కలాం సర్కిల్‌గా ఉన్న ప్రాంతాన్ని మళ్లీ సర్కిల్‌ పేరుతో నామకరణం చేస్తున్నామంటూ కొత్తగా స్థూపం నిర్మించి తన పేరును, వైసీపీ రంగులను వేసి రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. వెంటనే శిల్పా పేరును, వైసీపీ రంగులను తొలగించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Updated Date - Mar 07 , 2024 | 12:54 AM