దేశం గర్వించదగ్గ నేత సీతారాం ఏచూరి
ABN , Publish Date - Sep 14 , 2024 | 01:15 AM
దేశం గర్వించదగ్గ నేత సీతారాం ఏచూరి అని జిల్లా మోటార్ వర్క్స్ యూనియన అధ్యక్షుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్ అన్నారు.
కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 13: దేశం గర్వించదగ్గ నేత సీతారాం ఏచూరి అని జిల్లా మోటార్ వర్క్స్ యూనియన అధ్యక్షుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్ అన్నారు. శుక్రవారం సీతారాం ఏచూరి చిత్రపటా నికి పూలమాలలు నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు రియాజ్, గంగాధర్, ప్రసాద్ పాల్గొన్నారు. ఏపీ వేర్ హస్ హమాలీ యూనియన కమిటీ ఆధ్వర్యంలో వేర్ హౌస్ లో సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు, ఆర్.నరసింహులు, సాయిబాబా, పాల్గొన్నారు. ఏపీ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు సిటీ కమిటీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ కార్యాలయంలో ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా కార్యదర్శి సి.గురుశేఖర్, సీహెచ.శ్రీనివాసులు, శేషా ద్రి, మద్దిలేటి, కర్రెన్న పాల్గొన్నారు. కార్మిక కర్షక భవనలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీవైఎఫ్‌ఐ జిల్లా కార్య దర్శి నగేష్ పాల్గొన్నారు.
ఓర్వకల్లు: సీతారాం ఏచూరి మృతి పార్టీకి తీరని లోటు అని సీపీఎం మండల కార్యదర్శి నాగన్న అన్నారు. శుక్రవారం మండలంలోని ఓర్వకల్లు నన్నూరు గ్రామాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. కార్యక్రమంలో మధుసూదన, సుధాకర్, శేఖర్, ఎల్లరాజు, మాసూంబాషా, శ్రీరాములు, ఈశ్వరయ్య, జీవేశ్వరుడు పాల్గొన్నారు.
గూడూరు: స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి సంతప సభను నిర్వహించారు. ఆయన చిత్రప టానికి పూలమాల వేసి నివాళ్లులర్పించారు. సీపీఎం మండల కార్యదర్శి జే మోహన, సీఐటీయూ మండల అధ్యక్షుడు గుంటప్ప, నాయకులు వెంకటే శ్వర్లు, రంగన్న, సోమలింగడు, మధు, మద్దిలేటి పాల్గొన్నారు.