RRR: రఘురామకు సీటు పక్కా!
ABN , Publish Date - Mar 29 , 2024 | 05:35 PM
ఈ ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థిగా కె. రఘురామకృష్ణరాజుకు సీటు కేటాయించేందుకు తీవ్ర కసరత్తు జరుగుతోన్నట్లు రాజకీయ వర్గాల్లో ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది. అందుకోసం అటు బీజేపీ, ఇటు టీడీపీ, మరోవైపు జనసేన చర్చకు తెర తీసినట్లు సమాచారం.
ఈ ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థిగా కె. రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishnam Raju) పోటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న వేళ లేటెస్ట్ అప్‌డేట్ తెరపైకి వచ్చింది. రఘురామ కృష్ణరాజుకు సీటు కేటాయింపుపై ఎన్డీయే కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో రఘురామకు లోక్‌సభ సీటు గ్యారంటీ అని, ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే అది కూటమిలో ఏ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. గత ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు బరిలో దిగి గెలిచారు. ఆ తర్వాత ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి.. ఆ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో ఆయన వైసీపీ రెబల్ ఎంపీగా పేరు గాంచారు.
ఇక త్వరలోనే జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నరసాపురం నుంచి పోటీ చేస్తారనే ఓ ప్రచారం జరుగుతోంది. ఒకానొక సమయంలో టీడీపీ ఆయనకు ఎంపీ అభ్యర్థిగా ఆఫర్ ఇవ్వబోతోందని, కానీ ఆయన బీజేపీ నుంచి బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. కానీ బీజేపీ మాత్రం ఆయనకు టికెట్ కేటాయించలేదు. మరోవైపు ముఖ్యమంత్రి వైయస్ జగన్.. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ద్వారా తనకు టికెట్ రాకుండా చేశారని రఘురామకృష్ణరాజే స్వయంగా ఆరోపించారు.
ఇంకోవైపు విజయనగరం లోక్ సభ స్థానం నుంచి ఆయన బరిలో దిగుతున్నట్లు ఓ ప్రచారం జరిగినా.. అదీ కూడా నిజం కాలేదు. ఇంకోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన ఇప్పటికే పలు దఫాలుగా అభ్యర్థుల జాబితా విడుదల చేశాయి. మరి అలాంటి సమయంలో ఈ ట్రిపుల్ ఆర్‌ను ఎక్కడ సీటు కేటాయించి సర్దుబాటు చేస్తారనే ఓ చర్చ సైతం రాజకీయ వర్గాల్లో వాడి వేడిగా నడుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జల్లాలు లేదా విజయనగరంలో ఇస్తే మాత్రం ఆయన గెలుపు నల్లేరు మీద నడక అవుతుందనే ఓ ప్రచారం సైతం సాగుతోంది.
మరి అలాంటి వేళ.. ఏ జిల్లాలో ఏ లోక్‌సభ స్థానాన్ని ఆయనకు ఏ పార్టీ కేటాయిస్తుందనేది రఘురామకృష్ణరాజు ఫ్యాన్స్‌కు సైతం తీవ్ర ఉత్కంఠతకు గురి చేస్తోంది. ఆయనకు ఎంపీ టికెట్ కేటాయించి.. ప్రకటించే వరకు ఆయన ఫ్యాన్స్‌కే ఆయన ఫ్యాన్స్‌కే టెన్షన్ కాదు... ఫ్యాన్ పార్టీ అధినేతకు సైతం టెన్షన్ అనే ఓ ప్రచారం సైతం రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది.
వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. సుప్రీంకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏప్రిల్ 1వ తేదీ విచారణ చేపతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం తెలిపిన విషయం తెలిసిందే.
మరిన్నీ ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..