Palla Srinivasa Rao : ‘ప్యాలెస్’పై ప్రజాభీష్టమే!
ABN , Publish Date - Jun 19 , 2024 | 04:52 AM
తాజా మాజీ సీఎం జగన్.. రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌ను ఎలా విని యోగించుకోవాలనే విషయంపై అ న్ని కోణాల్లోనూ ఆలోచన చేస్తామ ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
రుషికొండ భవనాల వినియోగంపై
అన్నికోణాల్లో ఆలోచించి అడుగులు
వైసీపీ నేతలకు పార్టీలోకి ‘నో ఎంట్రీ’
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
విశాఖపట్నం, జూన్ 18(ఆంధ్రజ్యోతి): తాజా మాజీ సీఎం జగన్.. రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌ను ఎలా విని యోగించుకోవాలనే విషయంపై అ న్ని కోణాల్లోనూ ఆలోచన చేస్తామ ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్యాలెస్ విష యంలో ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మంగళవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ కోసం గత ప్రభుత్వం రూ.700 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందన్నారు. ఈ నిర్మాణాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని తెలిపారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమరావతిపై దృష్టి పెట్టారని, పనుల్లో కదలిక వచ్చిందన్నారు. ఏడాదిలోపే అమరావతికి ఒక రూపు తీసుకువస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును జగన్ సర్వనాశనం చేశారని విమర్శించారు. వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెట్టారని, వీటిపై సమీక్షించి 100 రోజుల్లో ఎత్తివేతకు చర్యలు తీసుకుంటామని పల్లా తెలిపారు. క్రిమినల్ కేసులు, ప్రధానంగా కోర్టులో ఉన్న కేసులు తప్ప రాజకీయ పరమైన కేసులు ఎత్తివేసి కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.
టోల్ ఎత్తివేత
విశాఖ నగర శివారులో ఉన్న అగనంపూడి టోల్‌గేటును నెల రోజుల్లో ఎత్తివేసేలా చర్యలు చేపట్టామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు త్వరలో కేంద్రం నుంచి ప్రకటన వస్తుందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము చేసిన పోరాటానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు విశాఖలో దోచుకున్న, బెదిరించి లాక్కున్న భూముల ను వెనక్కి తీసుకుంటామని పల్లా తెలిపారు. దససల్లా భూములు, సీబీసీఎన్‌సీ భూములు, హయగ్రీవ, ఎన్‌సీసీ భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తామన్నారు. అక్రమాలకు పాల్పడిన మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జి. వెంకటేశ్వరరావు తదితరులను టీడీపీలో చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు.