TDP: చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి రఘురామ
ABN , Publish Date - Apr 05 , 2024 | 09:20 PM
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) చేరారు. శుక్రవారం నాడు పాలకొల్లులో జరిగిన ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో ఎంపీ రఘురామకు టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రఘురామ సేవలను పార్టీ వినియోగించుకుంటుదని తెలిపారు.
పశ్చిమగోదావరి: తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) చేరారు. శుక్రవారం నాడు పాలకొల్లులో జరిగిన ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో ఎంపీ రఘురామకు టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రఘురామ సేవలను పార్టీ వినియోగించుకుంటుదని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు (Chandrababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీని తన సొంత నియోజకవర్గంలోకి రాకుండా జగన్ అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో జరిగే అక్రమాలపై గళమెత్తిన వ్యక్తి రఘురామ అని తెలిపారు. అక్రమ కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించిన దుర్మార్గుడు జగన్ అని ధ్వజమెత్తారు.
Kutami: 7 స్థానాల్లో అభ్యర్థులు గెలిచి మోదీ, బాబు, పవన్‌లకు కానుకగా ఇస్తాం: కేశినేని చిన్ని
రఘురామ టీడీపీలోకి రావడం చూస్తే 2024లో ఫ్యాన్ ముక్కలవుతుందని ఎద్దేవా చేశారు. జగన్ చేతుల నుంచి చాలామందిని కాపాడానని చెప్పారు. కొందరు జగన్ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో సలీమ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అన్నమయ్య జిల్లాలో వైసీపీ నాయకులు ఒకరి ఆస్తిని బలవంతంగా రాయించుకోవడంతో కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.
Prudhvi Raj: నేను డ్యాన్స్ చేస్తే ఆ మంత్రి తట్టుకోలేకపోయారు
వైసీపీ నేతలు ఆస్తులు కబ్జా చేస్తే తప్పని చెప్పే హక్కు లేదా అని ప్రశ్నించారు. జగన్ చేస్తున్న అక్రమాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏపీలో ఆడపిల్లలకు రక్షణ లేదని, ఆస్తులకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తుపెట్టుకున్నాయని చెప్పారు. రఘురామను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. ఆయన సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో పార్టీ నిర్ణయిస్తుందని చంద్రబాబు అన్నారు.
ఇవి కూడా చదవండి
Nara Bhuvaneshwari: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబుపై రుద్దుతున్నారు
AP Election 2024: ఏపీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన
మరిన్ని ఏపీ వార్తల కోసం...