Share News

Nara Bhuvaneshwari: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబుపై రుద్దుతున్నారు... సీఎం జగన్‌పై నారా భువనేశ్వరి ఫైర్

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:41 PM

రాష్ట్ర యువత ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు(Chandrababu) అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.

Nara Bhuvaneshwari: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబుపై రుద్దుతున్నారు... సీఎం జగన్‌పై నారా భువనేశ్వరి ఫైర్

నంద్యాల: రాష్ట్ర యువత ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో మండుటెండను కూడా లెక్క చేయకుండా భువనేశ్వరిని కలిసేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు.


Kutami: 7 స్థానాల్లో అభ్యర్థులు గెలిచి మోదీ, బాబు, పవన్‌లకు కానుకగా ఇస్తాం: కేశినేని చిన్ని

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారని చెప్పారు. వైసీపీ (YSRCP) నాయకుల కుట్రపూరిత ప్రచారాలను తెలుగుదేశం కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలు చేసిన త్యాగాలు మరువలేనివని అన్నారు. టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు ఎన్ని విధాలుగా వేధించినా ఎవరూ వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. తాను ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని చేపట్టే ముందు తన సన్నిహితులు వద్దని వారించారని అయినా తాను వెనక్కి తగ్గలేదన్నారు. వైసీపీ దుర్మార్గులు ఏమైనా చేస్తారేమోనని భయపడ్డారన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఉండగా తనను ఎవరు ఏం చేయలేరని అన్నారు. తనను కాపాడుకునే పసుపు సైనికులు ఉండగా తనకు భయం లేదని చెప్పారు.


Purandeswari: మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుంది

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబుపై రుద్దుతున్నారని మండిపడ్డారు. పింఛన్ల గురించి చంద్రబాబుపై దుష్పచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో పసుపు సైనికులంతా సైకిల్ స్పీడు పెంచాలన్నారు. సైకిల్‌కు అడ్డొచ్చిన దుర్మార్గులను తొక్కుకుంటూ ముందుకెళ్లాలని.. ఎక్కడ వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల జెండాలు వేరు కావొచ్చు కానీ మూడు పార్టీల అజెండా ఒక్కటేనని ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావడమే ఈ కూటమి లక్ష్యమని వివరించారు.


రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీని ఢీకొట్టేందుకు టీడీపీ కార్యకర్తలంతా పోరాడాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి

YCP: బుగ్గన వర్గానికి మహిళల నుంచి ఊహించని పరిణామం..

AP Elections: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన గుంటూరు, అనంత కీలక నేతలు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 05 , 2024 | 04:05 PM