Share News

Ambati Rambabu: సత్తెనపల్లిలో మంత్రి అంబటికి షాక్

ABN , Publish Date - Mar 21 , 2024 | 01:38 PM

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. కట్టావారిపాలెం సర్పంచ్ పార్వతి కూమారి, ఎంపీటీసీ సభ్యురాలు అనూరాధ, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మదమంచి రాంబాబులు వైసీపీకి రాజీనామా చేశారు.

Ambati Rambabu: సత్తెనపల్లిలో మంత్రి అంబటికి షాక్

పల్నాడు: పల్నాడు జిల్లా సత్తెనపల్లి (Sathenapally)లో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు షాక్ తగిలింది. కట్టావారిపాలెం సర్పంచ్ పార్వతి కూమారి, ఎంపీటీసీ సభ్యురాలు అనూరాధ, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మదమంచి రాంబాబులు వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ (YSRCP)లో ఇమడలేక మదమంచి రాంబాబు రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. వైసీపీ కోసం 4 ఎకరాలు సొతత భూమి అమ్ముకున్నానని తెలిపారు. వైసీపీలో తనకు ప్రాధాన్యత లేదన్నారు. పదవి ఉన్నా కూడా తాను సామాన్య కార్యకర్తగానే ఉన్నానని మదమంచి రాంబాబు తెలిపారు.

Lokesh: పెత్తందారులెవరో అర్థమవుతోందా రాజా?!

సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఈ ఏడాది జనవరిలో అసమ్మతి వర్గం సమావేశాలు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో అసమ్మతి నాయకులు సమావేశమయ్యారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటును స్థానికులకు ప్రకటించాలన్నారు. సత్తెనపల్లిలో అంబటి పేరు వినపడకూడదని.. అంబటికి సీటు ఇస్తే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో అంబటి పోటిచేస్తే ఓడిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ కోసం కష్టపడ్డ అందరినీ అంబటి రాంబాబు ఇబ్బంది పెట్టారని అసమ్మతి నేతలు వాపోయారు. అంబటి వద్దు, జగన్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. స్టెప్పులేసిన మంత్రి అంబటి రాంబాబు సంబరాల రాంబాబుగా మారిపోయారని, అలాంటి మంత్రి తమకు వద్దు అని ప్రత్యర్థి వర్గం డిమాండ్ చేస్తుండటం గమనార్హం.

YS Sharmila: జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 21 , 2024 | 01:38 PM