రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించండి
ABN , Publish Date - Feb 05 , 2024 | 11:48 PM
రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఆపార్టీ నాయకులు కోరారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు సోమవారం భవిష్యత్‌కు గ్యారెంటీ, పల్లెపల్లెకు టీడీపీ కార్యక్రమాలను నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు.

రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఆపార్టీ నాయకులు కోరారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు సోమవారం భవిష్యత్‌కు గ్యారెంటీ, పల్లెపల్లెకు టీడీపీ కార్యక్రమాలను నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు.
వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయి: బగ్గు
జలుమూరు (సారవకోట), ఫిబ్రవరి 5: రాష్ట్రంలో వైసీపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, సార్వత్రిక ఎన్ని కల్లో టీడీపీ విజయదుందుభి మోగిస్తుందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బద్రి గ్రామంలో సోమవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి వైసీపీ అరాచక పాలనపై ప్రజలకు అవగాహన కలిగించారు. గ్రామాల్లో టీడీపీ చేపడుతున్న భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చేసి వైసీపీ నేతల్లో వణు కు పుడుతోందన్నారు. గ్రామస్థాయి నుంచి సైనికుల్లా పనిచేసి టీడీపీ విజయానికి కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర బీసీ కమిటీ ప్రతినిధి ధర్మాన తేజకుమార్, పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు సురవరపు తిరుపతిరావు, పి.నందకిశోర్, డి.జయరాం, ఇ.నాగరాజు పాల్గొన్నారు. రంగాపురం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ ఆధ్వర్యంలో భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. తాడేల భీమారావు, ఇ.నాగరాజు, చెంచల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు పాలన అనివార్యం: కలమట
పాతపట్నం: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధిం చాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలన అనివార్యమని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి అన్నారు. సోమవారం పాతపట్నంలో పర్యటించి పలువురు తటస్థులను కలిసి టీడీపీకి మద్దతు తెలపాలని కోరారు. లింగాల రవి, రాజేశ్వరరావు, లుకలాపు రామచంద్రరావు, మల్ల ధనుంజయ, దంత అప్పల నాయుడు, సుగ్రీవులు తదితరులను కలిసి టీడీపీ విజయానికి సహకరించాలని కోరారు. స్థానిక సమస్యలను పరిష్కరించు కునేందుకు అందరం కలిసి పనిచేద్దామన్నారు. కార్యక్రమంలో నాయకులు పైల లక్ష్మయ్య, సైలాడ సతీష్, నల్లి లక్ష్మణ, బి.వసంత, ఇప్పిలి రాజా, అక్కం ద్ర సన్యాశి, శాసనపురి బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు: కొత్తూరులో బాబుష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయ కులు తిరుపతి, లోకేష్, అరుణ్, చింతాడ కోటేశ్వరరావు, కృష్ణ పాల్గొన్నారు.
జలుమూరు: టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జి బోడేన బాలకృష్ణ అన్నారు. పాగోడు గ్రామంలో సోమవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ నిర్వహించారు. ఇంటిం టికీ వెళ్లి వైసీపీ అరాచక విధానాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు కింజరాపు ప్రకాష్, దుబ్బ రామారావు, మొయ్యి శ్రీనివాసరావు, సింహాచలం పాల్గొన్నారు.
పలాస: వైసీపీ పాలనలో రాష్ట్రం దేశంలో చివరి స్థానానికి వెళ్లిపోయిందని, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ అభివృద్ధి చెందుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు అన్నారు. 31వ వార్డులో సోమ వారం పల్లెపల్లెకు టీడీపీ నిర్వహించారు. మూడు రాజధా నుల పేరుతో సీఎం జగన్ ఐదేళ్లు గడిపి కనీస సదుపా యాలు కల్పించలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి లొడగల కామేశ్వరరావు యాదవ్, నాయకులు గాలి కృష్ణారావు, గురిటి సూర్య నారాయణ, టంకాల రవిశంకర్ గుప్తా, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, దడియాల నర్సింహులు, నాబిలి శ్రీనివాస్, కొత్త సత్యం, ఎ.రామకృష్ణ పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, అందువల్ల రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. సోమవారం చిన్నసాన, జీయన్న పేట గ్రామాల్లో పల్లె పల్లెకు టీడీపీ నిర్వహించారు. కార్యక్ర మంలో మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరి వర ప్రసాద్, పార్టీ మండల అధ్య క్షుడు బోయిన రమేష్, నాయకులు వెలమల కామేశ్వరరావు, విజయలక్ష్మి, తర్ర రామకృష్ణ, గొండు లక్ష్మణరావు, పూజారి శైలజ పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు: రాష్ట్రంలో సీఎం జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని, వీటిని తిప్పి కొట్టాలని టీడీపీ మండల అధ్యక్షుడు సూరాడ మోహన రావు, క్లష్టర్ ఇన్‌చార్జి పుచ్చ ఈశ్వరరావు, మాజీ ఎంపీపీ గొరక వసంతరావు అన్నారు. సోమవారం వజ్రపుకొత్తూరు, పెద్దమురహరిపురం పంచాయతీల్లో పల్లె పల్లెకు టీడీపీ కార్య క్రమం నిర్వహించారు. టీడీపీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీ లను ప్రజలకు వివరించాలని కార్యకర్తలను ఎంపీటీసీ సూళ్ల చిట్టిబాబు, నేతలు ఎ.ఉమామహేశ్వర రావు, కర్ని రమణ, బి.శశిభూషణ్, మరడ ధుర్యోధనరెడ్డి, పి.సాంబమూర్తి, కోనేరు కామేశ్వరరావు పాల్గొన్నారు.
టెక్కలి: రాష్ట్రంలో నిత్యా వసర వస్తువులతో పాటు పెట్రోల్, డీజిల్, విద్యుత్ చార్జీలు పెరగడానికి కారణమైన వైసీపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో సాగనంపాలని టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి అన్నారు. సోమవారం బూరగాం పంచాయతీ భగీరథపేటలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహిం చారు. కార్యక్రమంలో నేతలు హనుమంతు రామకృష్ణ, మామిడి రాము, మెండ దమయంతి, పోలాకి షణ్ముఖరావు, గేదెల సంజీవరెడ్డి, రూపావతి తదితరులు పాల్గొన్నారు.
హరిపురం: టీడీపీతోనే గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బావన దుర్యో ధన అన్నారు. కొంకడాపుట్టి, సందిగాం, కొయిటాసాయి గిరిజన గ్రామాల్లో సోమవారం పల్లెపల్లెకు టీడీపీ నిర్వహించారు. కార్యక్రమంలో తమిరి భాస్కరరావు, రట్టి లింగరాజు, సంతోష్, చంద్ర శేఖర్, మాలతి మురళి పాల్గొన్నారు.
పొందూరు: మండలంలోని వివిధ గ్రామాల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీని నిర్వహిం చారు. పొందూరు, రాపాక, లోలుగు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి టీడీపీ మేనిఫెస్టోను వివరించారు. కార్య క్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రామ్మోహన్, నేతలు శంకరభాస్కర్, లోలుగు వెంకట్, రవికుమార్, అప్పల నాయుడు పాల్గొన్నారు.
కంచిలి: చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ మండల నాయకులు అన్నారు. సోమవారం ఎంఎస్‌పల్లిలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించి, ఇంటింటికీ వెళ్లి కర పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూర్యనారాయణ, రామారావు, రమేష్, శ్రీకాంత్, రమేష్‌రెడ్డి, కిశోర్, భాస్కర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.