Share News

CM Chandrababu: సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానన్న చంద్రబాబు.. సుదీర్ఘ కాలం తర్వాత..

ABN , Publish Date - Jun 21 , 2024 | 08:15 AM

శపథాలు చేయడం.. సవాళ్లు విసరడమనేది రాజకీయాల్లో సర్వసాధారణం. అయితే దానిని నెరవేర్చుకోవడమే చాలా కష్టం. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే.. 2021 నవంబర్ 19న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఓ శపథం చేశారు. దానిని నెరవేర్చుకుని నేడు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.

CM Chandrababu: సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానన్న చంద్రబాబు.. సుదీర్ఘ కాలం తర్వాత..

అమరావతి: శపథాలు చేయడం.. సవాళ్లు విసరడమనేది రాజకీయాల్లో సర్వసాధారణం. అయితే దానిని నెరవేర్చుకోవడమే చాలా కష్టం. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే.. 2021 నవంబర్ 19న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఓ శపథం చేశారు. దానిని నెరవేర్చుకుని నేడు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇంతకీ ఆ శపథం ఏంటంటారా? అసెంబ్లీలో అడుగు పెడితే ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానన్నారు. ఆ శపథాన్ని చంద్రబాబు నేడు నెరవేర్చనున్నారు. నేటి నుంచి రెండు రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.


అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. రెండున్నరేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నేడు తొలిసారిగా అసెంబ్లీలో చంద్రబాబు అడుగు పెట్టనున్నారు. 2021 నవంబర్ 19న ముఖ్యమంత్రిగానే మళ్లీ గౌరవసభలో అడుగుపెడతానని చంద్రబాబు శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ ఇవాళ ముఖ్యమంత్రిగా అడుగు పెట్టబోతున్నారు. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకల్లా పసుపు చొక్కాలతో వెంకటపాలెం రావాలని ఎమ్మెల్యేలకు టీడీఎల్పీ సూచించింది.

Updated Date - Jun 21 , 2024 | 08:15 AM