Kanakamedala: పులివెందులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ABN , Publish Date - Apr 12 , 2024 | 11:36 AM
సీఎం జగన్ (CM Jagan) పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టాలని మాజీ ఎంపీ, టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindra Kumar) కేంద్ర ఎన్నికల ముఖ్య కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. పులివెందులలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు.
● సీఈకి టీడీపీ నేత కనకమేడల లేఖ
అమరావతి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ (CM Jagan) పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టాలని మాజీ ఎంపీ, టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindra Kumar) కేంద్ర ఎన్నికల ముఖ్య కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. పులివెందులలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. ‘‘అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన రూరల్ సీఐ అశోక్‌రెడ్డిని వెంటనే బదిలీ చేయాలి.
ఆ సీఐ ఐదేళ్లుగా ఒకే స్థానంలో పని చేస్తున్నారు. కానీ కడప జిల్లా ఎస్పీ ఫంక్షనల్ పోస్ట్ అంటూ కవరప్ చేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో 68 కేంద్రాల్లో కేవలం 32 మాత్రమే సమస్యాత్మకమని ఎస్పీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. కానీ, వాటి సంఖ్యను పెంచాలి. పులివెందుల అర్బన్ డెలవప్‌మెంట్ అథారిటీ ఓఎస్‌డీ అనిల్‌కుమార్‌రెడ్డి వివక్షపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా పని చేసినందుకు సీఎం ఆశీస్సులతో ఇటీవలే అనిల్‌కుమార్‌రెడ్డి ఐఏఎస్ కేడర్ పొందారు’’ అని ఫిర్యాదుచేశారు.
Bheesetty Babji: రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చిన జగన్
మరిన్ని ఏపీ వార్తల కోసం..