చంద్రబాబు తిరుగు ప్రయాణం
ABN , Publish Date - Feb 27 , 2024 | 01:50 AM
శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్ ప్రయాణమైన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సోమవారం రాత్రి విమానాశ్రయంలో పార్టీ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు.

శ్రీకాకుళంలో ‘రా...కదలిరా’ సభ ముగించుకుని హైదరాబాద్ బయలుదేరిన టీడీపీ అధినేత
ఎయిర్‌పోర్టుకు వీడ్కోలు పలికిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులు
గోపాలపట్నం, ఫిబ్రవరి 26:
శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్ ప్రయాణమైన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సోమవారం రాత్రి విమానాశ్రయంలో పార్టీ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. చంద్రబాబునాయుడు శ్రీకాకుళంలో ‘రా...కదలిరా’ సభను ముగించుకుని రోడ్డు మార్గంలో రాత్రి 8.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన వెంట శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఉన్నారు. ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.శ్రీభరత్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బుద్ధా నాగజగదీశ్వరరావు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, గుమ్మడి సంధ్యారాణి, కోళ్ల లలితకుమారి, కోరాడ రాజబాబు, హర్షవర్ధన్‌ప్రసాద్, పీలా శ్రీనివాస్, తదితరులు చంద్రబాబునాయుడుకు వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.