Kandula Durgesh: ఏపీలో హెల్త్ టూరిజంని అభివృద్ధి చేస్తాం..
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:52 PM
నారాయణగిరి ఉద్యానవణం వద్ద ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన హోటల్‌ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. టీటీడీ నిర్ణయించిన ధరల మేరకు భక్తులకు సరసమైన ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తామన్నారు.
తిరుమల: నారాయణగిరి ఉద్యానవణం వద్ద ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన హోటల్‌ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. టీటీడీ నిర్ణయించిన ధరల మేరకు భక్తులకు సరసమైన ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తామన్నారు. ఇప్పటికే తిరుమలలో మూడు హోటల్స్ ని నడుపుతున్నామన్నారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి హోటల్స్‌ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. తిరుపతిలో టూరిజం శాఖకు చెందిన 30 ఎకరాల స్థలంలో కూడా త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని కందుల దుర్గేష్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు.
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెయ్యడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచుతామని కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎకో, టెంపుల్, హెరిటేజ్,హెల్త్ టూరిజంని అభివృద్ధి చేస్తామన్నారు. చిన్నపాటి అభివృద్ధి చెయ్యడం ద్వారా పర్యాటక రంగం ఆదాయాన్ని పెంచవచ్చన్నారు. కేంద్రం కూడా పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కేంద్రం ద్వారా కూడా రాష్ట్రానికి నిధులు తెచ్చి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజం శాఖ ద్వారా దర్శించుకునే భక్తులకు స్వామి వారి దర్శనానికి అధిక సమయం పడుతోందన్నారు. ఈ సమస్యను ఈవో దృష్టికీ తీసుకెళ్లి టూరిజం ద్వారా వచ్చే భక్తులకు త్వరగతిన దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చెయ్యాలని విజ్ఞప్తి చేస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం శాఖలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి త్వరగతిన పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్.. కారణమిదేనట..!
Harish Rao: ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు.. అప్రజాస్వామ్యపాలన
Read Latest AP News And Telugu News