Share News

వైసీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటాం : ఎమ్మెల్యే చంటి

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:21 AM

అధికార బలంతో ఏలూరులో వైసీపీ కార్యాలయాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించా రు. కూటమి ప్రభుత్వం రాగానే దీన్ని రెగ్యు లర్‌ చేయాలని రూ.14 లక్షలు కట్టారు. ఎన్ని లక్షలు కట్టిన క్రమబద్ధీకరించే ప్రసక్తే లేదు.

వైసీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటాం : ఎమ్మెల్యే చంటి
వైసీపీ కార్యాలయాన్ని చూపుతున్న ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరు టూ టౌన్‌, జూన్‌ 26: ‘అధికార బలంతో ఏలూరులో వైసీపీ కార్యాలయాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించా రు. కూటమి ప్రభుత్వం రాగానే దీన్ని రెగ్యు లర్‌ చేయాలని రూ.14 లక్షలు కట్టారు. ఎన్ని లక్షలు కట్టిన క్రమబద్ధీకరించే ప్రసక్తే లేదు. ప్రభుత్వం ఈ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటుంది’ అని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తేల్చి చెప్పారు. అనుమతులు లేకుండా ఏలూరులో నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించి మాట్లాడారు. ‘వైసీపీ కార్యాలయాన్ని నిర్మించిన స్థలాన్ని 2006లో డాన్‌ అనే కంపెనీకి కమర్షియల్‌ కాంప్లెక్స్‌కు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అనంతరం ఆ కంపెనీతో అగ్రిమెంట్‌ క్యాన్సిల్‌ చేయకుండా గత ప్రభుత్వ హయాంలో ఆ స్థలంలో వైసీపీ కార్యాలయ నిర్మాణం చేపట్టా రు. ఇందుకు నగర పాలక సంస్థ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ నుంచి 33 ఏళ్లకు ఎకరానికి రూ.వెయ్యి ఇచ్చే విధంగా లీజుకు తీసుకున్నారు. తక్షణం వైసీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలి’ అని కమిషనర్‌ వెంకటకృష్ణను ఆదేశించారు. ఈ కట్ట డాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కానీ, జూని యర్‌ కళాశాలలకు కానీ, వసతి గృహాలకు కానీ వినియోగిస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 12:21 AM