Share News

Andhra Pradesh: జగన్ ఆశలు అడియాశలేనా? నెక్ట్స్ జరిగేది ఇదేనా?

ABN , Publish Date - Jul 20 , 2024 | 04:16 PM

AP Politics: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌కు భారీ షాక్ తగలనుందా? ఆ పార్టీకి చెందిన పలువురు రాజ్యసభ ఎంపీలు ఆయనకు హ్యాండిచ్చేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాజకీయ వర్గాల నుంచి. పైగా.. ఇవాళ జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌కు పలువురు ఎంపీలు గైర్హాజరవడం..

Andhra Pradesh: జగన్ ఆశలు అడియాశలేనా? నెక్ట్స్ జరిగేది ఇదేనా?
YSRCP

అమరావతి, జులై 20: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌కు(YS Jagan) భారీ షాక్ తగలనుందా? ఆ పార్టీకి చెందిన పలువురు రాజ్యసభ ఎంపీలు ఆయనకు హ్యాండిచ్చేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాజకీయ వర్గాల నుంచి. పైగా.. ఇవాళ జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌కు పలువురు ఎంపీలు గైర్హాజరవడం ఈ ప్రచారానికి మరింత ఊతమందిస్తోంది. శనివారం నాడు పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజ్యసభ ఎంపీలు సుబ్బారెడ్డి, నిరంజన్ రెడ్డి, పరిమిల్ నత్వాని, మోపిదేవి వెంకటరమణ, మేడా రఘునాథ రెడ్డి హాజరవలేదు. దీంతో వీరి గైర్హాజరీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఘోర పరాభవం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 175 స్థానాలకు గానూ ఆ పార్టీ కేవలం 11 చోట్ల మాత్రమే గెలుపొందింది. లోక్‌సభ స్థానాల్లో నాలుగు చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఈ పరాభవం నుంచి పార్టీ అధినేత జగన్ కోలుకోక ముందే.. ఆ పార్టీ నేతలు ఆయనకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. ఈ క్రమంలోనే ఆయనకు ముఖం చాటేయడం షురూ చేశారు వైసీపీ నేతలు. వైసీపీలో ఇంకా కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరమేనని పలువురు నేతలు భావిస్తున్నారట. అందుకే అటు బీజేపీ, ఇటు టీడీపీ వైపు చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో టీడీపీలో చేరితే మరింత ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయమూ వ్యక్తం చేస్తున్నారట.


టీడీపీ వైపు ఎంపీల చూపు..

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. దీంతో కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన శ్రేణుల సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ కేడర్ మాత్రం ఫుల్ జోష్‌లో ఉంది. మరోవైపు ఎన్నికల్లో కేవలం 11 ఎమ్మెల్యే సీట్లకే వైసీపీ పరిమితం అవడంతో.. ఆ పార్టీ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి చెందిన ఎంపీలు సహా ముఖ్య నేతలు సైతం తమ రాజకీయ భవిష్యత్‌పై అంతర్మథనం చేసుకుంటున్నారట. రాష్ట్రంలో వైసీపీకి ఇక చాన్స్ రాదని, ఈ పార్టీలో తాము కొనసాగితే తమకు భవిష్యత్ ఉండని లెక్కలేసుకుంటున్నారట. వైసీపీని వీడి టీడీపీలో చేరితే.. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలోనూ తమకు ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారట. అందుకే.. వైసీపీ నేతలు పలువురు జగన్ ఏ కార్యక్రమం నిర్వహించినా ముఖం చాటేస్తున్నారట. ఈ నేతలంతా.. రేపో మాపో టీడీపీలో చేరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


రాజ్యసభలో వైసీపీకి బలం.. టీడీపీ వ్యూహం..

రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేల బలం తక్కువే అయినప్పటికీ.. రాజ్యసభలో మాత్రం ఆ పార్టీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఏపీ నుంచి ఉన్న రాజ్యసభ సభ్యులందరూ వైసీపీకి చెందిన వారే కావడం, టీడీపీకి ఒక్కరు కూడా లేకపోవడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. ఇక రాజ్యసభలో బీజేపీ సంఖ్యాబలం తక్కువగా ఉంది. మరి సంఖ్యాబలం కావాలంటే.. వైసీపీపై బీజేపీ ఆధారపడాల్సి వస్తుంది. తద్వారా కేంద్రంలో వైసీపీకి అనుకూల పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. దీనిని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తన ప్రయత్నాలు తాను మొదలుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మొత్తం వైసీపీ ఎంపీలో ఉండటంతో.. ఆ పార్టీ కేంద్రం సహకారంతో పటిష్టమయ్యే అవకాశం ఉందని టీడీపీ అధిష్టానం అంచనా వేస్తోంది. అందుకే.. ఆదిలోనే చెక్ పెట్టాలని భావిస్తున్నారట. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధమయ్యారట. ఇప్పటికే నలుగురైదుగురు ఎంపీలు వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబుకు సంకేతాలు పంపించారట. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు కేంద్రంలోని పెద్దలకు కూడా చెప్పారని సమాచారం. వైసీపీ ఎంపీలను టీడీపీలో చేర్చుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీపై ఆధారపడకుండా చేయాలనేది టీడీపీ లక్ష్యం. తద్వారా వైసీపీని అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో బలహీనమవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read:

శాంతి ఇష్యూపై విజయసాయి వివరణ!

క్షీణించిన కవిత ఆరోగ్యం?.. భర్త అనిల్ కంటతడి!

కన్వర్ యాత్ర కొత్తగా జరుగుతోందా?..నిలదీసిన కపిల్ సిబల్

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jul 20 , 2024 | 04:16 PM