Share News

Banks Hiring: డిగ్రీ పూర్తైందా.. బ్యాంకుల్లో అప్రెంటిస్ నియామకాలు

ABN , Publish Date - Sep 07 , 2024 | 10:34 AM

బ్యాంకులు పెద్దఎత్తున అప్రెంటిస్‌ల(Apprentices in Banks) నియామకాలకు సిద్దమవుతున్నాయి. నెల రోజుల్లోనే వీరి ఎంపిక పూర్తవుతుందని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఐ) సీఈఓ సునీల్‌ మెహతా చెప్పారు.

Banks Hiring: డిగ్రీ పూర్తైందా.. బ్యాంకుల్లో అప్రెంటిస్ నియామకాలు

ముంబయి: బ్యాంకులు పెద్దఎత్తున అప్రెంటిస్‌ల(Apprentices in Banks) నియామకాలకు సిద్దమవుతున్నాయి. నెల రోజుల్లోనే వీరి ఎంపిక పూర్తవుతుందని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఐ) సీఈఓ సునీల్‌ మెహతా చెప్పారు. డిగ్రీ పూర్తి చేసి 21–25 సంవత్సరాల మధ్య వయసున్న యువతీ, యువకులు ఈ పోస్టులకు అర్హులని తెలిపారు. బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించిన ప్రత్యేక నైపుణ్యాల్లో వీరికి శిక్షణ ఇచ్చి నెలకు రూ.5,000 చొప్పున స్టైఫండ్‌ చెల్లిస్తామన్నారు.

ఐఐటీలు, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో డిగ్రీ పూర్తి చేసిన వారు ఇందుకు అనర్హులు. వీరి అప్రెంటిస్‌షిప్‌ ఏడాది పాటు ఉంటుంది. తర్వాత పనితీరు ఆధారంగా వీరిని బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లుగా నియమించే అవకాశం ఉందని మెహతా చెప్పారు. అద్భుత పనితీరు కనబరిచే అప్రెంటిస్‌లను బ్యాంకులు రెగ్యులర్‌ ఉద్యోగులుగా తీసుకునే అవకాశం కూడా ఉందన్నారు.


ప్రభుత్వ లక్ష్యం మేర..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. రాబోయే ఐదేళ్లలో కోటి మంది యువతకు టాప్-500 కంపెనీలలో ఇంటర్న్‌షిప్‌లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో మెహతా మాట్లాడుతూ.. "మార్కెటింగ్, రికవరీల కోసం నైపుణ్యం కలిగిన యువత అవసరం లేని చాలా రంగాలు ఉన్నాయి. మేము వారికి ఆయా రంగాలలో శిక్షణ ఇస్తాం. వారు తమకు తాము ఉపాధిని సృష్టించుకోవచ్చు" అని తెలిపారు. అప్రెంటీస్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పన్ను చెల్లింపుదారులు కాకూడదని చెప్పారు. బ్యాంకింగ్ సేవలను విస్తృతపరిచేందుకు వారికి ఏడాదిపాటు శిక్షణ ఇచ్చి బిజినెస్ కరస్పాండెంట్‌లుగాగానీ ఇతర రంగాలలోగానీ నియమించుకోవచ్చని పేర్కొన్నారు.

For Latest News click here

Updated Date - Sep 07 , 2024 | 10:34 AM