BSNL Vs Jio: జియోను వెనక్కి నెట్టిన బీఎస్ఎన్ఎల్.. మరికొద్ది రోజుల్లో..
ABN , Publish Date - Oct 20 , 2024 | 06:03 PM
ప్రైవేట్ కంపెనీలు పెంచిన రీఛార్జ్ ధరలు తట్టుకోలేక లక్షలాది మంది ఇప్పటికే బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. మరోవైపు దేశంలోని అనేక నగరాల్లో బీఎస్ఎన్‌ఎల్ ఇప్పటికే.. తన 4G నెట్‌వర్క్ ప్రారంభించింది. తాజాగా 5G నెట్‌వర్క్ సేవలను సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. అందులోభాగంగా సంస్థ తన సేవలను మెరుగు పరచడం కోసం వేలాది కొత్త సెల్ టవర్లను ఏర్పాటు చేసింది.
సెల్ ఫోన్ రీఛార్జ్ ధరలను జియో, ఎయిర్‌టెల్, వీఐ కంపెనీలు భారీగా పెంచేశాయి. దీంతో రీఛార్జ్ ధరలు దాదాపుగా రెట్టింపు అయ్యాయి. పెరిగిన ఈ రీఛార్జ్ ధరలతో సామాన్య మానవుడు ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. దీంతో అతడి అడుగులు కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్‌ఎల్ వైపు పడుతున్నాయి. ఎందుకంటే.. ఈ సంస్థ రీఛార్జ్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. జియో, ఎయిర్‌టెల్, వీఐ కంపెనీలతో పోలిస్తే మాత్రం బీఎస్ఎన్‌ఎల్ రీఛార్జ్ ధరలు సగటు జీవికి అందుబాటులో ఉన్నాయనే చెప్పాలి.
Also Read: Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం.. ఐ ఫోన్ 15 ధర ఎంతంటే..?
ప్రైవేట్ కంపెనీలు పెంచిన రీఛార్జ్ ధరలు తట్టుకోలేక లక్షలాది మంది ఇప్పటికే బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. మరోవైపు దేశంలోని అనేక నగరాల్లో బీఎస్ఎన్‌ఎల్ ఇప్పటికే.. తన 4G నెట్‌వర్క్ ప్రారంభించింది. తాజాగా 5G నెట్‌వర్క్ సేవలను సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. అందులోభాగంగా సంస్థ తన సేవలను మెరుగు పరచడం కోసం వేలాది కొత్త సెల్ టవర్లను ఏర్పాటు చేసింది.
Also Read: HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో ప్రైవేట్ సెల్ కంపెనీలకు బీఎస్ఎన్ఎల్ గట్టి పోటీ ఇస్తుంది. ఎందుకంటే.. బీఎస్ఎన్ఎల్ 395 రోజుల రీఛార్జ్ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ ధర రూ. 2,399గా నిర్ణయించారు. ఈ ప్లాన్ తీసుకుంటే ప్రతి రోజు రూ. 6.57 ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ ప్లాన్‌లో అపరమిత కాల్స్ పొందడమే కాకుండా.. ప్రతి రోజు 2 జీబీ హై స్పీడ్ ఇంటర్నెట్‌ను సైతం పొందవచ్చు. అంతేకాకుండా.. ప్రతి రోజు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు సైతం పొందుతారు. ఇక ప్లాన్‌లో చాలా గేమ్స్ ఉచితంగా ఆడుకోవచ్చు. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ సబ్‌స్క్రిప్షన్ తదితర అనేక ప్రయోజనాలు సైతం పొందుతారు.
Also Read: Secunderabad Bandh: సికింద్రాబాద్‌లో బంద్.. ఆందోళనకారులపై కేసు నమోదు
అదే జియో ఏడాది ప్లాన్ లేకుంటే.. 365 రోజుల ప్లాన్..
ఈ ప్లాన్‌లో రీఛార్జ్ ధర రూ. 3,599గా ఉంది. అంటే బీఎస్ఎన్‌ఎల్, జియో సెల్ ఫోన్ రీఛార్జీల ధరల మధ్య వ్యత్యాసం దాదాపు రూ. 1200 ఉంది. అదీకాక బీఎస్ఎన్‌ఎల్ ప్లాన్‌లో 395 రోజులకు రీఛార్జ్ వర్తిస్తుంటే.. జియో ప్లాన్‌లో 365 రోజులకే వర్తిస్తుంది. అంటే ఇరవై రోజుల బీఎస్ఎన్‌ఎల్ అధికంగా ఇస్తుంది. ఇక జియోలో అయితే .. ప్రతి రోజు 2.5 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. మీరు 2.5 GB ఎగ్జాస్ట్ చేస్తే, మీకు 5G డేటా కూడా లభిస్తుంది.
Also Read: ఉలవలు ఆహారంగా తీసుకోవడం వల్ల.. ఇన్ని ప్రయోజనాలున్నాయా..?
కానీ దీని కోసం ఎటువంటి అదనపు నగదు చెల్లించ వలసిన అవసరం అయితే లేదు. అంతేకాకుండా..ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా పొంద వచ్చు. అలాగే ఎటువంటి అదనపు రీఛార్జీ చేయకుండా దేశవ్యాప్తంగా కాల్స్ కూడా చేసుకోవచ్చు. అయితే జియో ప్లాన్.. బీఎస్ఎన్‌ఎల్ ప్లాన్ కంటే ఖరీదైనది. కానీ BSNL 4G ఇప్పటికీ ప్రతి నగరంలో అందుబాటులో లేదు. అలాగే 5G సేవలను సైతం తీసుకు వస్తుంది.
ఈ నేపథ్యంలో BSNL కంటే Jio యొక్క సేవ చాలా మెరుగ్గా ఉన్నాయి. అయితే మరికొద్ది రోజుల్లో బీఎస్ఎన్ఎల్ 5G సేవలు అందుబాటులోకి వస్తే మాత్రం.. మరింత మంది ప్రజలు ఆ సేవలు అందుకునేందుకు క్యూ కడతారనడంలో ఎటువంటి సందేహం అయితే లేదని మధ్య తరగతి ప్రజలు సైతం క్రిస్టల్ క్లియర్‌గా స్పష్టం చేస్తున్నారు
For Business News And Telugu News..