Recharge Offer: ప్రైవేట్ రీఛార్జ్ ప్లాన్‌లకు BSNL గట్టి పోటీ.. రుపాయికే ప్లాన్!
ABN , Publish Date - Aug 12 , 2024 | 11:33 AM
ఇటివల దేశంలో ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచేశాయి. డేటా ప్లాన్స్‌తో పాటు టాక్ టైం ప్లాన్లను కూడా మార్పు చేశారు. దీంతో అనేక మంది కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రైవేటు నెట్ వర్క్ నుంచి BSNLకు మారిపోతున్నారు. ఈ క్రమంలోనే BSNL కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.
ఇటివల దేశంలో ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచేశాయి. డేటా ప్లాన్స్‌తో పాటు టాక్ టైం ప్లాన్లను కూడా మార్పు చేశారు. దీంతో అనేక మంది కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రైవేటు నెట్ వర్క్ నుంచి BSNLకు మారిపోతున్నారు. ఈ క్రమంలోనే BSNL కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఒక్క నెలలోనే కోట్లాది మంది తమ సిమ్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యారని ఇటివల ఓ నివేదికలో తెలిసింది. అయితే BSNL ప్లాన్‌లు అన్ని ప్రైవేట్ కంపెనీల ప్లాన్‌ల కంటే చాలా చౌకగా మారడంతో మరింత మంది ఈ నెట్‌వర్క్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతోపాటు మరికొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా 4G సేవలు కూడా మెరుగ్గా వస్తాయని అధికారులు చెబుతున్నారు.
ఒక రోజు రూ. 1కే
ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్క రూపాయికి ఒక రోజు వాలిడిటీని అందించే ప్లాన్‌ను BSNL ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. BSNL కొత్తగా ఇటివల రూ. 91 ప్లాన్‌ని పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో కంపెనీ రూ. 91 ప్రీ పెయిడ్ ప్లాన్ వాలిడిటీ 90 రోజులు అందుబాటులో ఉంటుంది. అంటే ఒక రోజు వాలిడిటీ కేవలం రూ. 1కే లభిస్తుందని చెప్పవచ్చు. ఈ ధరలో ఏ ప్రైవేట్ కంపెనీ ప్లాన్స్ కూడా దరిదాపుల్లో కూడా లేవు. అంతేకాదు ఇంత తక్కువలో ప్రైవేట్ కంపెనీలు ఇచ్చే ఆలోచనలు కూడా కనిపించడం లేదు. ఈ ప్లాన్‌తో నిమిషానికి 15 పైసల చొప్పున కాల్ చేయవచ్చు. 1 పైసా చొప్పున 1MB డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ గ్రామీణ కస్టమర్లకు ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
Gold and Silver Rate Updates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి.. ఎంతకు చేరాయంటే..
రూ. 107 ప్లాన్ కూడా..
మరోవైపు BSNL రూ. 107 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. సాధారణంగా ఇది 20-28 రోజుల వ్యాలిడిటీని అందించే ఇతర ప్రొవైడర్ల మాదిరిగా కాకుండా, ఈ ప్లాన్ వాలిడిటీని 35 రోజులకు పొడిగించింది. అపరిమిత కాల్‌లకు బదులుగా వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లలో 200 కాలింగ్ నిమిషాల వరకు మాట్లాడుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లోని డేటా భత్యం మొత్తం 35 రోజుల వ్యవధిలో 3GBకి పరిమితం చేయబడింది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలతోపాటు తర్వాత క్రమంగా 5జీ సేవలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తామమని ఇటివల కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News