ITR Filing: ఇప్పటివరకు 66 శాతం మాత్రమే ఐటీఆర్ దాఖలు.. ఇంకా వారం రోజులే గడువు
ABN , Publish Date - Jul 25 , 2024 | 12:44 PM
దేశంలో ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 66% మంది పన్ను చెల్లింపుదారులు మాత్రమే కొత్త పన్ను విధానాన్ని(New ITR) ఎంచుకున్నారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఛైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు మొత్తం 4 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌లు(ITR Filing) దాఖలు చేశారని చెప్పారు. అయితే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి జులై 31 చివరి తేదీ ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ చేస్తున్నారు.
దేశంలో ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 66% మంది పన్ను చెల్లింపుదారులు మాత్రమే కొత్త పన్ను విధానాన్ని(New ITR) ఎంచుకున్నారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఛైర్మన్ రవి అగర్వాల్ బుధవారం తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు మొత్తం 4 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌లు(ITR Filing) దాఖలు చేశారని చెప్పారు. బడ్జెట్ తర్వాత పన్ను ప్రక్రియను సరళీకృతం చేయడంపై ప్రభుత్వం, ప్రత్యక్ష పన్నుల పరిపాలన శాఖ దృష్టి సారించిందని ఆయన అన్నారు. వీటిలో ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన రిటర్న్‌ల దాఖలు, వ్యాపారాలు సహా ఇతర విషయాలు కూడా ఉన్నాయన్నారు. ప్రస్తుతం అపరాధ రుసుం లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ జులై 31, 2024గా ఉంది.
మరింత పెరుగుతుందా
అయితే జులై 23 వరకు దాఖలు చేసిన రిటర్నుల సంఖ్య గతేడాది ఇదే కాలంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని సీబీడీటీ ఛైర్మన్ అన్నారు. గతేడాది జులై 25న 4 కోట్ల రిటర్న్ ఫైలింగ్‌లు నమోదు కాగా, ఈసారి జులై 22 రాత్రి నాటికే ఈ లక్ష్యాన్ని చేరుకున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో కొత్త పాలనలో ఐటీఆర్ ఫైల్(ITR Filing) చేసే వారి సంఖ్య మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు రవి అగర్వాల్ చెప్పారు. చివరిసారిగా జులై 31 వరకు 7.5 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని CBDT చీఫ్ అన్నారు. 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి కూడా ఆడిట్ చేయని అనేక కేటగిరీలలో రిటర్న్ ఫైలింగ్ ప్రస్తుత సీజన్ జులై 31న ముగుస్తుంది. ఈ క్రమంలో ఈసారి ఐటీఆర్ దాఖలు చేసేందుకు మరో వారం రోజులు గడువు ఉన్న నేపథ్యంలో మరికొంత మంది దాఖలు చేసే అవకాశం ఉందన్నారు.
బడ్జెట్ ప్రసంగంలో
అంతేకాదు పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా సమాచారాన్ని పొందుతున్నారని CBDT చీఫ్ గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రక్రియ మరింత సులభతరం అవుతుందన్నారు. మరోవైపు ఇప్పటికే ఇటివల కేంద్ర బడ్జెట్ 2024లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇది కాకుండా కొత్త పాలనలో మరికొన్ని రాయితీలు కూడా ప్రకటించారు. దీంతో పన్ను చెల్లింపుదారలకు మరింత ప్రయోజనం లభించనుంది.
ఇవి కూడా చదవండి:
Stock Markets: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 538 పాయింట్ల పతనం
Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే
Gold and Silver Prices Today: వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
Read More Business News and Latest Telugu News