Share News

ఐడీబీఐ బ్యాంకు రేసులో కోటక్‌ బ్యాంకు !

ABN , Publish Date - Aug 02 , 2024 | 02:40 AM

ఐడీబీఐ బ్యాంకు ఈక్విటీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు కోటక్‌ మహీంద్రా బ్యాంకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం బిడ్డింగ్‌లో కూడా పాల్గొంది...

ఐడీబీఐ బ్యాంకు రేసులో కోటక్‌ బ్యాంకు !

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు ఈక్విటీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు కోటక్‌ మహీంద్రా బ్యాంకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం బిడ్డింగ్‌లో కూడా పాల్గొంది. ఈ బ్యాంకు ఈక్విటీలో కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. ఇందులో మేనేజ్‌మెంట్‌ కంట్రోల్‌తో 60.7 శాతం వాటా అమ్మకానికి ప్రభుత్వం బిడ్లు ఆహ్వానించింది. దీంతో కోటక్‌ బ్యాంకుతో పాటు ప్రవాస భారత బిలియనీర్‌ ప్రేమ్‌ వత్సా నేతృత్వంలోని ఫెయిర్‌ఫాక్స్‌ ఇండియా, యూఏఈకి చెందిన ఎమిరేట్స్‌ ఎన్‌డీబీ సంస్థలు ప్రాథమిక బిడ్స్‌ ఫైల్‌ చేశాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ బిడ్స్‌కు ఇప్పటికే క్లియరెన్స్‌ ఇచ్చింది. ఆర్‌బీఐ అనుమతి ఒక్కటే మిగిలి ఉంది. త్వరలోనే ఆర్‌బీఐ నుంచి కూడా అనుమతి లభిస్తుందని భావిస్తున్నారు. అపుడు ఈ మూడు సంస్థలు తమ తుది బిడ్స్‌ సమర్పించాలి. అయితే ఈ వార్తలపై ఈ మూడు సంస్థలు అధికారికంగా నోరు మెదపడం లేదు. ఈ ప్రయత్నంలో విజయవంతమైతే కోటక్‌ బ్యాంకుకు ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకు తర్వాత ఇది రెండో కొనుగోలు అవుతుంది.

Updated Date - Aug 02 , 2024 | 02:40 AM