Stock Markets: బుల్ జోరు..స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు
ABN , Publish Date - Feb 23 , 2024 | 11:36 AM
స్టాక్ మార్కెట్‌లో ఈరోజు సరికొత్త రికార్డు నమోదైంది. ప్రధాన సూచీలు కొత్త రికార్డు గరిష్ట స్థాయి వద్ద ప్రారంభమయ్యాయి. నిఫ్టీ తొలిసారిగా 22290 స్థాయిని దాటింది. సెన్సెక్స్ కూడా బలంతో 73400 స్థాయిని దాటింది.
స్టాక్ మార్కెట్(stock market)లో ఈరోజు సరికొత్త రికార్డు నమోదైంది. ప్రధాన సూచీలు కొత్త రికార్డు గరిష్ట స్థాయి వద్ద ప్రారంభమయ్యాయి. నిఫ్టీ(Nifty) తొలిసారిగా 22290 స్థాయిని దాటింది. సెన్సెక్స్ కూడా బలంతో 73400 స్థాయిని దాటింది. ఆల్ రౌండ్ కొనుగోళ్ల కారణంగా మార్కెట్‌లో ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గత రెండు రోజుల నష్టాల తర్వాత ఈరోజు లాభాల దిశగా దూసుకెళ్తున్నాయి.
దీంతో సెన్సెక్స్ 236 పాయింట్ల జంప్‌తో 73394 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ ఆల్ టైమ్ హై(all time high) లెవెల్ 22290తో రోజును ప్రారంభించింది. గురువారం నాడు నిఫ్టీ ఒక దశలో 22,297 వద్ద కొత్త గరిష్ట స్థాయిని తాకింది. దీంతో షేర్ మార్కెట్లో ఈరోజు మరో రికార్డు నమోదైంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT)లో లాభాలు, ప్రపంచ మార్కెట్లలో అనుకూలమైన అంశాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతుంది.
ఈ క్రమంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.51 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ బ్యాంక్(bank nifty), నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ఇతర హెవీ వెయిట్‌లు కూడా నిన్న పతనమైన తర్వాత మళ్లీ పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, M&M, విప్రో, HDFC లైఫ్ వంటి కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా భారతి ఎయిర్‌టెల్, BPCL, ఏషియన్ పెయింట్స్, NTPC, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వంటి సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Best Home Loans: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంక్స్ ఇవే..!