Share News

Business Idea: రూ.40 వేలతో పెట్టుబడి.. నెలకు రూ.40 వేలకుపైగా ఆదాయం

ABN , Publish Date - Feb 16 , 2024 | 07:08 PM

మీరు తక్కువ ఖర్చుతో సీజనల్ బిజినెస్ చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే వచ్చే ఎండాకాలంలో కేవలం 40 వేల రూపాయల పెట్టుబడి పెట్టి నెలకు రూ.40 వేలకుపైగా సంపాదించే అవకాశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Business Idea: రూ.40 వేలతో పెట్టుబడి.. నెలకు రూ.40 వేలకుపైగా ఆదాయం

ప్రస్తుత రోజుల్లో కరోనా తర్వాత అనేక మందికిపై ఆరోగ్యంపై అవగాహన ఏర్పడింది. ఈ క్రమంలో జనాలు ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. సీజన్‌ను బట్టి ఆయా పండ్లు, పండ్ల రసాలను కూడా స్వీకరిస్తు్న్నారు. అయితే మరికొన్ని రోజుల్లో ఎండాకాలం రానున్న నేపథ్యంలో తక్కువ ఖర్చుతో బిజినెస్ ప్రారంభించి నెలకు 40 వేలకు పైగా సంపాదించే అవకాశం ఉంది. అది ఎలానో ఇప్పుడు చుద్దాం.

ఫ్రూట్ జ్యూస్ బిజినెస్. దీనికి ఎడాకాలంలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎండా కాలంలో బయట తిరిగే ప్రతి ఒక్కరూ జ్యూస్ తప్పక సేవిస్తారు. మీరు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే ఇది మీకు బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఎంత ఖర్చు అవుతుంది. లాభాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ తెలుసుకుందాం.


ఖర్చు ఎంత?

జ్యూస్ వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే మీకు ఒక జ్యూస్ మెషిన్ అవసరం అవుతుంది. మీరు పండ్లు, కూరగాయలను నిల్వ చేయడానికి చిన్న ఫ్రిడ్జ్. ఇది కాకుండా మీకు కత్తి, కత్తిరించే బోర్డు, పండ్ల కట్టర్, పెద్ద, చిన్న సైజు గ్లాసెస్, గిన్నె లేదా చెంచా వంటి కొన్ని సాధనాలు కూడా అవసరం. వీటికి 40 వేల రూపాయల లోపే ఖర్చు అవుతుంది. ఈ వ్యాపారాన్ని ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలి. మీ దగ్గర అంత డబ్బు లేకపోతే ముద్ర లోన్ కూడా పొందవచ్చు.

లాభాలు ఎలా ఉంటాయ్ ?

ప్రస్తుతం మార్కెట్లోని జ్యూస్ షాపుల్లో ఒక గ్లాసు జ్యూస్ విక్రయిస్తే రూ.20 నుంచి 30 రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఈ విధంగా చూసుకుంటే మీకు గ్లాసుకు కనీసం రూ.10 నుంచి 15 వరకు లాభం వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన రోజుకు 150 గ్లాసులు అమ్మినా కూడా గ్లాసుకు 10 రుపాయల చొప్పున లాభం వేసుకుంటే రోజుకు 1500 రూపాయలు సంపాదించవచ్చు.

ఇలా చూస్తే నెలకు 40 వేలకుపైగా సంపాదించుకునే ఛాన్స్ ఉంది. కానీ మీరు మీ కస్టమర్లకు తాజా పండ్ల రసాలను అందించకపోతే మీరు ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించలేరు. తాజా పండ్లను సేకరించి రుచికరమైన రసాలను వినియోగదారులకు అందించడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్ల ఆదరణ పొంది మంచి లాభాలను ఆర్జించవచ్చు.

Updated Date - Feb 16 , 2024 | 07:08 PM