చిన్న మొత్తాల పొదుపు రేట్లు యథాతథం
ABN , Publish Date - Jun 29 , 2024 | 04:15 AM
ఈ జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై చెల్లించే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ప్రకటించింది. అనగా, ప్రస్తుత రేట్లే మరో మూడు నెలలు...
ఈ జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై చెల్లించే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ప్రకటించింది. అనగా, ప్రస్తుత రేట్లే మరో మూడు నెలలు కొనసాగనున్నాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి చిన్న మొత్తాల పొదుపు రేట్లను సవరిస్తుంటుంది. ఈ రేట్లను యథాతథంగా కొనసాగించడం వరుసగా ఇది రెండో సారి. ప్రస్తుతం సుకన్య సమృద్ధి పథకంపై వడ్డీ రేటు 8.2 శాతంగా ఉండగా.. మూడేళ్ల టర్మ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్)పై లభించే వార్షిక వడ్డీ ఆదాయ రేటు 7.1 శాతంగా ఉంది. పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ స్కీమ్‌లో 4 శాతం, కిసాన్ వికాస్ పత్రాలపై 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్‌ఎస్‌సీ)పై లభించే వడ్డీ రేటు 7.7 శాతంగా ఉంది.