Share News

Stock Market: వారాంతంలో కూడా స్టాక్ మార్కెట్ జోరు.. ఇవే టాప్ 5 స్టాక్స్

ABN , Publish Date - Sep 20 , 2024 | 09:58 AM

భారతీయ స్టాక్ మార్కెట్లకు శుక్రవారం బలంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా జంప్‌ చేయగా, నిఫ్టీ కూడా 100 పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీ రికార్డు స్థాయికి చేరువలో ఉంది.

Stock Market: వారాంతంలో కూడా స్టాక్ మార్కెట్ జోరు.. ఇవే టాప్ 5 స్టాక్స్
stock market open positive

అమెరికా స్టాక్ మార్కెట్‌లలో రాత్రిపూట లాభాల కారణంగా భారతదేశంలో స్టాక్ మార్కెట్‌లు(stock markets) కూడా వారాంతంలో(శుక్రవారం) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ప్రభావం ఇతర ఆసియా మార్కెట్‌లపై కూడా కనిపించింది. మార్కెట్ ప్రారంభమైన కాసేపటికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 421 పాయింట్లు లేదా 0.51 శాతం పెరిగి 83,606 వద్ద, నిఫ్టీ 112 పాయింట్లు లేదా 0.44 శాతం వృద్ధి చెంది 25,528 స్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 184 పాయింట్లు లాభపడి 53,221 పరిధిలో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 278 పాయింట్లు ఎగబాకి 59,614కి చేరుకుంది.


టాప్ స్టాక్స్

ఈ క్రమంలో JSW స్టీల్, కోల్ ఇండియా, HDFC లైఫ్, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, మహీంద్రా & మహీంద్రా కంపెనీల స్టాక్స్ టాప్ 6 లాభాలతో ఉండగా, అదే సమయంలో సిప్లా, NTPC, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, గ్రాసిమ్, ఇండస్ ఇండ్ సంస్థల స్టాక్స్ టాప్ 6 నష్టాల్లో ఉన్నాయి. అన్ని రంగాలలో మెటల్, రియాల్టీ సూచీలు 1.73 శాతం వరకు పెరిగాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా చాలా ఇతర రంగాల సూచీలు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ 0.59 శాతం లాభపడగా, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 0.50 శాతం ముందంజలో ఉంది


ఆసియా మార్కెట్లు

వాల్ స్ట్రీట్ ఉప్పెనతో శుక్రవారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 225 1.76 శాతం వృద్ధితో అగ్రగామిగా ఉండగా, ఆస్ట్రేలియా S&P/ASX 200 0.2 శాతం పెరిగింది. దక్షిణ కొరియా బ్లూ చిప్ కోస్పి 1.45 శాతం పురోగమించగా, స్మాల్ క్యాప్ కోస్‌డాక్ 1.51 శాతం పెరిగింది. హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ 18,177 స్థాయిలో ఉంది. HSI చివరి ముగింపు 18,013 కంటే ఎక్కువగా ఉంది. చైనా బ్లూ చిప్ CSI 300తో ముడిపడి ఉన్న ఫ్యూచర్స్ 3,198.8 పరిధిలో ఉన్నాయి.


12 శాతం పుంజుకున్న షేర్లు

మార్చిలో విధించిన గోల్డ్ లోన్ వ్యాపారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మునుపటి ఆంక్షలను ఎత్తివేయడంతో బీఎస్‌ఈలో ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ షేర్లు 12.3% పెరిగి రూ.555.25కి చేరాయి. మరోవైపు సర్దుబాటు చేసిన స్థూల రాబడిలో ఆరోపించిన లోపాలను సరిదిద్దాలన్న అభ్యర్థనలను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా స్టాక్ గురువారం 19% క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు పెరిగి 83.61 వద్ద ఉంది.

భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం BSE సెన్సెక్స్ 236.57 పాయింట్లతో 83,184.80 వద్ద ముగిసింది. ఆ క్రమంలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 83,773.61ని చేరుకున్నాయి. నిఫ్టీ 50 రికార్డు గరిష్ట స్థాయి 25,611.95ని తాకాయి. ఆ తర్వాత 38.25 పాయింట్లు పెరిగి 25,415.80 వద్ద ముగిసింది.


ఇవి కూడా చదవండి:

Viral Video: ఐఫోన్ 16 కోసం 20 గంటలు లైన్లో వేచిఉన్న ప్రజలు


Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 20 , 2024 | 10:13 AM