Stock Market: ఒడిదొడుకుల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ 5 స్టాక్స్
ABN , Publish Date - Dec 02 , 2024 | 10:27 AM
భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీలు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. మొదట లాభాలతో మొదలైన సూచీలు క్రమంగా నష్టాల వైపు మారాయి. ఆ తర్వాత మళ్లీ లాభాల్లోకి దూకాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాప్ 5 స్టాక్స్ ఏం ఉన్నాయో ఇక్కడ చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) వారాంతంలో మొదటిరోజైన సోమవారం (డిసెంబర్ 2న) లాభాలతో మొదలై, క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ ఉదయం 10.17 గంటల నాటికి లాభాల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 65 పాయింట్ల లాభంతో ట్రేడై 79,866 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 24,169 పరిధిలో ట్రేడవుతోంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 145 పాయింట్లు పడిపోవడం విశేషం. ఇక నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 270 పాయింట్లు పుంజుకుని 56,663 స్థాయికి చేరుకుంది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే వేల కోట్ల రూపాయలు దక్కించుకున్నారు.
టాప్ 5 స్టాక్స్
ఈ క్రమంలో HDFC లైఫ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సిప్లా, HUL, లార్సెన్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, సన్ ఫార్మా సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. టెలికాం ఆపరేటర్లు వాయిదా వేసిన స్పెక్ట్రమ్ చెల్లింపుల కోసం బ్యాంక్ గ్యారెంటీ అవసరాలను రద్దు చేయడానికి కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకరించిన తర్వాత గత కొన్ని ట్రేడింగ్ సెషన్‌లలో వోడాఫోన్ ఐడియా షేర్లు 30 శాతం వరకు పెరిగాయి. దీంతో సోమవారం ఉదయం 10 గంటలకు వోడా ఐడియా స్టాక్ ప్రతికూల జోన్‌లో స్వల్పంగా రూ. 8.30 స్థాయిలో ట్రేడవుతోంది.
జాబితాలో ఈ కంపెనీలు కూడా..
సోమవారం బ్లాక్ డీల్స్ ద్వారా దాదాపు 19 మిలియన్ ఈక్విటీ షేర్లు కౌంటర్‌లో చేతులు మారిన తర్వాత సోమవారం ఇంట్రా డే ట్రేడ్‌లో హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా షేర్లు BSEలో 7 శాతం పడిపోయాయి. ఉదయం 09:15 గంటలకు హోమ్‌ఫస్ట్ మొత్తం ఈక్విటీలో 21 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 18.79 మిలియన్ల ఈక్విటీ షేర్లు BSEలో చేతులు మారినట్లు ఎక్స్ఛేంజ్ డేటా తెలిపింది. పండుగ సీజన్‌లో కూడా బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటా మేలో 49.8 శాతం నుంచి అక్టోబర్‌లో 31 శాతానికి పడిపోయింది. ఇది నవంబర్‌లో ఇంకా 25.3 శాతానికి దిగజారింది. దీంతో ఈ ఏడాది అత్యల్పంగా 29,191 రిజిస్ట్రేషన్‌లు మాత్రమే అయ్యాయి.
గతవారం మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్లు గత వారం స్వల్పంగా మెరుగుపడినట్లు కనిపించింది. కానీ సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ గణాంకాలు కాస్త నిరాశపరిచాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో GDP వృద్ధి దాదాపు రెండేళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం అంచనా వేయగా 5.4 శాతం మాత్రమే వృద్ధి చెందింది. అయితే జీఎస్టీ వసూళ్లలో వృద్ధి కొనసాగుతోంది. నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 8.5 శాతం పెరిగి రూ.1 లక్షా 82 వేల కోట్లకు చేరాయి.
ఇవి కూడా చదవండి:
Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..
Real vs Fake Charger: మీ ఫోన్ ఛార్జర్ నిజమైనదా, నకిలీదా.. ఇలా గుర్తించండి..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More Business News and Latest Telugu News