Layoffs: మరో టెక్ కంపెనీలో 50% ఉద్యోగుల తొలగింపు.. భయాందోళనలో..
ABN , Publish Date - Mar 30 , 2024 | 10:36 AM
గత కొన్ని నెలలుగా పలు టెక్ కంపెనీలలో లే ఆఫ్స్(layoffs) ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పటికే గూగుల్(google), అమెజాన్(amazon) సహా పలు అగ్ర సంస్థలు తమ ఉద్యోగుల్లో కోతలను విధించాయి. ఈ నేపథ్యంలో తాజాగా జీ(Zee) ఎంటర్‌టైన్‌మెంట్ బెంగళూరు(Bengaluru) ఆధారిత టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (TIC)లో 50 శాతం మంది ఉద్యోగులను తొలగించారు.
గత కొన్ని నెలలుగా పలు టెక్ కంపెనీలలో లే ఆఫ్స్(layoffs) ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పటికే గూగుల్(google), అమెజాన్(amazon) సహా పలు అగ్ర సంస్థలు తమ ఉద్యోగుల్లో కోతలను విధించాయి. ఈ నేపథ్యంలో తాజాగా జీ(Zee) ఎంటర్‌టైన్‌మెంట్ బెంగళూరు(Bengaluru) ఆధారిత టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (TIC)లో 50 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. ప్రత్యేక కమిటీ సూచన మేరకు కంపెనీ ఈ చర్య తీసుకున్నట్లు తెలిసింది. ఈ కమిటీ కంపెనీకి చెందిన వివిధ వ్యాపార రంగాలను అంచనా వేసి సూచనలు చేసింది.
TIC సాంకేతిక పరిష్కారాలను అందిస్తుంది. అయితే ఈ చర్య ద్వారా ఎంత మంది ఉద్యోగులు(employees) ప్రభావితమయ్యారనేది ఖచ్చితంగా తెలియలేదు. కానీ జీ ఎంటర్‌టైన్‌మెంట్ తన తాజా వార్షిక నివేదికలో మేము 650 మందికి పైగా ఇంజనీర్‌లను కలిగి ఉన్నామని తెలిపింది. కొంతమంది సీనియర్ స్థాయి వ్యక్తులు నిష్క్రమించిన తర్వాత జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు ఖర్చు తగ్గింపు కోసం బెంగళూరు(Bengaluru)లోని టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌లో తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది.
ఇటీవల నిర్వహించిన మంత్లీ మేనేజ్‌మెంట్ మెంటర్‌షిప్ (3M) ప్రోగ్రామ్‌లో బోర్డు నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (TIC) నిర్మాణాన్ని దాదాపు 50 శాతం తగ్గించిందని తెలిపింది. మరోవైపు మేము అసాధారణమైన కంటెంట్‌ను రూపొందించడంపై దృష్టి సారించామని Zee MD, CEO పునిత్ గోయెంకా అన్నారు. దీన్ని సాధించడానికి, మాకు సృజనాత్మక విధానం, భవిష్యత్ సాంకేతిక పరిష్కారాల మిశ్రమం అవసరమని చెప్పారు. తమ వద్ద ఉన్న వనరులను ఉపయోగిస్తూ నిరంతరం వృద్ధి కోసం పాటుపడేందుకు తక్కువ ఖర్చుతో కూడిన నిర్మాణం కోసం చూస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Mukhtar Ansari: నేడు ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు.. మార్మోగుతున్న నినాదాలు, సీఎం ఆదేశం