Share News

Chennai: దేవుడా.. ఎంతపని చేశావయ్యా.. వివాహమైన 13 రోజులకే..

ABN , Publish Date - Aug 24 , 2024 | 01:37 PM

వివాహమైన 13 రోజులకే ఓ యువకుడు అలిపిరి(Alipiri) కాలినడక మార్గంలో గుండెపోటుతో మృతిచెందాడు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు(Tamil Nadu)లోని తిరుత్తణికి సమీపంలో ఉన్న కీసలంకు చెందిన నరేష్‌(32) బెంగళూరులో స్థిరపడ్డాడు.

Chennai: దేవుడా.. ఎంతపని చేశావయ్యా.. వివాహమైన 13 రోజులకే..

- గుండెపోటుతో యువకుడి మృతి

- తిరుమల కాలినడక మార్గంలో ఘటన

- శోకసంద్రంలో కుటుంబీకులు

తిరుమల, చెన్నై: వివాహమైన 13 రోజులకే ఓ యువకుడు అలిపిరి(Alipiri) కాలినడక మార్గంలో గుండెపోటుతో మృతిచెందాడు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు(Tamil Nadu)లోని తిరుత్తణికి సమీపంలో ఉన్న కీసలంకు చెందిన నరేష్‌(32) బెంగళూరులో స్థిరపడ్డాడు. అక్కడి వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈనెల 11వ తేదీన స్వాతి అనే యువతితో వివాహమైంది. ఈక్రమంలో తిరుమలేశుడి ఆశీస్సుల కోసం భార్యతోపాటు తన తల్లిదండ్రులు, అత్తమామలు ఇలా దాదాపు 20 మంది కుటుంబీకులతో శుక్రవారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Nagarjuna: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై కోర్టును ఆశ్రయిస్తాం


కుటుంబ సభ్యులందరినీ వాహనాల్లోనే తిరుమలకు వెళ్లమని చెప్పాడు. తాను మాత్రం మొక్కు ఉందని అత్త కుమారుడితో కలిసి మధ్యాహ్నం 12.30 గంటలకు అలిపిరి నుంచి కాలినడక ప్రారంభించాడు. అప్పటివరకు బాగానే ఉన్న నరేష్‌.. 2,300 మెట్టు వద్దకొచ్చేసరికి ఛాతి పట్టుకుని కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న బంధువు, భక్తులు పైకి లేపే ప్రయత్నం చేశారు. మరోవైపు అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. అంబులెన్స్‌ సిబ్బంది వచ్చి తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరేష్‌ మృతి చెందాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు.


......................................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.......................................................................................

Hero Vijay: వివాదాస్పదంగా మారిన విజయ్‌ పార్టీ జెండా

- పోలీసులకు బీఎస్పీ ఫిర్యాదు

చెన్నై: నటుడు విజయ్‌(Actor Vijay) ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం పార్టీ కోసం ఆవిష్కరించిన జెండాకు వ్యతిరేకంగా గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో బీఎస్పీ శుక్రవారం ఫిర్యాదు చేసింది. కోలీవుడ్‌, టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న హీరో విజయ్‌ ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో ప్రారంభించిన పార్టీ కోసం రూపొందించిన జెండాను ఆయన గురువారం పనయూరులో జరిగిన పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆ జెండా నిండా మెరూన్‌ కలర్‌, పసుపుపచ్చ, పోరాటతత్వానికి చిహ్నంగా రెండు ఏనుగులు, మధ్య వాగై పుష్పం ఉండడం రాజకీయంగా వివాదాస్పదమైంది.

nani1.jpg


ఈ నేపథ్యంలో, విజయ్‌ పార్టీ జెండాలపై ఏనుగుల బొమ్మలు తొలగించాలంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆనందన్‌ డిమాండ్‌ చేశారు. తమ పార్టీ ఎన్నికల గుర్తు అయిన ఏనుగుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ అంగీకారం ఉందని, అందువల్ల ఇతర పార్టీలు తమ ఎన్నికల గుర్తును ఏ రూపంలోనూ వినియోగించుకోరాదని ఆనందన్‌ సోషల్‌ మీడియాలో వీడియో కూడా విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అసోం, సిక్కిం రాష్ట్రాలు మినహా మిగతా ఏ రాష్ట్రాల్లోను తమ పార్టీ చిహ్నం ఏనుగును ఏ జెండాలో వాడకూడదని ఆ వీడియోలో తెలిపారు.


అంతేకాకుండా ఆయన విజయ్‌ పార్టీ నిర్వాహకులకు కూడా ఆ వీడియో పంపించారు. ఇదిలా ఉండగా, స్థానిక ఆర్కే నగర్‌ ప్రాంతానికి చెందిన సంఘసేవకుడు ఆర్టీఐ సెల్వం శుక్రవారం వెప్పేరిలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో విజయ్‌(Vijay) పార్టీ జెండాకు వ్యతిరేకంగా పిటిషన్‌ సమర్పించారు. విజయ్‌ పార్టీ జెండాలో చట్టవిరుద్ధంగా కేరళ రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఏనుగుల గుర్తు ఉందని, వెళ్లాలర్‌ సామాజిక వర్గాలు ఉపయోగించే జెండా రంగులు, స్పెయిన్‌ జాతీయ పతాకంలోని రంగులు, శ్రీలంక తమిళులు గుర్తుగా ఉన్న వాగై పుష్పం అని ఎవరి అనుమతి లేకుండా జెండాలో వాటిని పొందుపరిచారని పేర్కొన్నారు.


కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం 2012వ సంవత్సరం నుంచి ఏ పార్టీ పతాకంలోనూ అడవి జంతువుల ఫొటోలు, పక్షులు వంటి చిహ్నాలను ముద్రించరాదని, అయితే ఈసీ నిబంధనలు కూడా విజయ్‌ పార్టీ ఉల్లంఘించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీ నిబంధనలు అతిక్రమించిన విజయ్‌పై పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాలని లేకుంటే హైకోర్టులో కేసు దాఖలు చేస్తానంటూ సెల్వం తన ఫిర్యాదులో తెలిపారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 24 , 2024 | 01:37 PM