Share News

Hydanabad: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ABN , Publish Date - Jul 13 , 2024 | 10:04 AM

హైదరాబాద్‌ నగరంలో గురువారం అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. వైట్నర్‌ మత్తులో ఉన్న యువకులు గొడ్డలి, రాళ్లతో పోలీసులపై దాడి చేయగా ఆత్మరక్షణ కోసం వారు కాల్పులు జరిపారు.

Hydanabad: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

- ఆత్మరక్షణ కోసం ఖాకీల కాల్పులు

- ఒకరికి బుల్లెట్‌గాయం.. పోలీసుల అదుపులో మరొకరు..

- నాంపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద ఘటన

హైదనాబాద్: హైదరాబాద్‌ నగరంలో గురువారం అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. వైట్నర్‌ మత్తులో ఉన్న యువకులు గొడ్డలి, రాళ్లతో పోలీసులపై దాడి చేయగా ఆత్మరక్షణ కోసం వారు కాల్పులు జరిపారు. ఈ ఘటన నాంపల్లి పోలీస్‌స్టేషన్‌(Nampally Police Station) పరిధిలో జరిగింది. అత్యంత రద్దీగా ఉండే రైల్వేస్టేషన్‌ వద్ద కాల్పుల శబ్దం వినగానే ప్రయాణికులు, ట్రావెల్‌ ఏజెంట్లు భయంతో పరుగులు పెట్టారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నాంపల్లి పోలీసులు, సెంట్రల్‌ జోన్‌ పోలీసులు సంయుక్తంగా సివిల్‌ డ్రెస్‌లో గురువారం అర్ధరాత్రి 12 గంటలకు డెకాయిట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. రైల్వేస్టేషన్‌ ముందున్న ఫుట్‌పాత్‌లపై తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.

ఇదికూడా చదవండి: Medigadda: మేడిగడ్డలో పరీక్షలకు అంతరాయం..


వారిని తనిఖీ చేసే ప్రయత్నం చేయగా మాంగార్‌ బస్తీకి చెందిన రాజు (24), అయ్యాను(26) పోలీసులపై గొడ్డలి, రాళ్లతో దాడికి దిగారు. పోలీసులమని చెబుతున్నా.. పట్టించుకోకుండా దాడికి తెగబడడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు తుపాకీతో కాల్పులు జరిపారు. రాజు తొడలో బుల్లెట్‌ దిగడంతో అతను అక్కడే కింద పడిపోగా అయ్యాన్‌ పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంబడించి అతన్ని పట్టుకుని నాంపల్లి పీఎ్‌సకు తరలించారు. గాయాలపాలైన రాజును ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శస్త్ర చికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం రాజు పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఇదికూడా చదవండి: KTR: ఢిల్లీ టూర్లు.. మా ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడమేనా?


తరచూ దారి దోపిడీలు..

city1.jpg

నిందితులపై గతంలోని హబీబ్‌నగర్‌ పోలీస్ స్టేషన్లో సెల్‌ఫోన్‌ దొంగతనాలకు సంబంధించిన కేసు నమోదు అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రోజూ నాంపల్లి రైల్వే స్టేషన్‌ వద్దకు వచ్చే ప్రయాణికులను బెదిరించి సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు విలువైన వస్తువులు, నగదును తస్కరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చేవి. అర్ధరాత్రి దొంగతనాలు కావడంతో బాధితులు ఉదయం వరకు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయకపోవడంతో నిందితులు సాఫీగా తప్పించుకుంటున్నారని అధికారులు గుర్తించి ఈ డెకాయిట్‌ ఆపరేషన్‌ను నిర్వహించారు. స్థానికంగా ఉండే బస్తీ వాసులే ఈ సంఘటనలో పట్టుబడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


వైట్నర్‌ మత్తులో..

మాంగార్‌ బస్తీ, హబీబ్‌నగర్‌, కోమటికుంట ప్రాంతాల్లో కొంతమంది యువకులు నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో బెల్ట్‌షాపులు, గంజాయి, మత్తు టాబ్లెట్ల అమ్మకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా నాంపల్లి రైల్వేస్టేషన్‌, పబ్లిక్‌ గార్డెన్‌, ఎంజీబీఎస్‌, బజార్‌ఘాట్‌ తదితర ప్రాంతాల్లో వైట్నర్‌ మత్తులో ఉండే యువకులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తాజా ఘటనలో సైతం ఆయా యువకులు వైట్నర్‌ మత్తులో ఉన్నట్లు గుర్తించారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 13 , 2024 | 10:04 AM