Share News

Hyderabad: సినిమా షూటింగ్‌లు లేక.. మద్యం తాగేందుకు డబ్బుల కోసం ఏం చేశాడో తెలిస్తే..

ABN , Publish Date - Jun 01 , 2024 | 11:23 AM

సినిమా షూటింగ్‌లు తగ్గాయి.. చేతిలో పనిలేదు.. మద్యం తాగేందుకు డబ్బు అవసరమై దొంగగా మారాడో మేకప్‌ ఆర్టిస్ట్‌(Makeup artist). వరుసగా నాలుగు వాహనాలు చోరీ చేసి వాటిని కుదవ పెట్టి వచ్చిన డబ్బుతో జల్సా చేసుకున్నాడు.

Hyderabad: సినిమా షూటింగ్‌లు లేక.. మద్యం తాగేందుకు డబ్బుల కోసం ఏం చేశాడో తెలిస్తే..

హైదరాబాద్: సినిమా షూటింగ్‌లు తగ్గాయి.. చేతిలో పనిలేదు.. మద్యం తాగేందుకు డబ్బు అవసరమై దొంగగా మారాడో మేకప్‌ ఆర్టిస్ట్‌(Makeup artist). వరుసగా నాలుగు వాహనాలు చోరీ చేసి వాటిని కుదవ పెట్టి వచ్చిన డబ్బుతో జల్సా చేసుకున్నాడు. దొంగతో పాటు వాహనాలను కుదవ పెట్టుకున్న వ్యక్తిని కూడా పోలీసులు కటకటాల వెనక్కి తోశారు. ఈనెల 24న ఓవ్యక్తి ఇందిరానగర్‌ సాయి వైన్స్‌ ఎదురుగా ద్విచక్ర వాహనం పార్క్‌ చేసి బయటకు వెళ్లాడు. తిరిగొచ్చి చూసేసరికి కనపించలేదు. దీంతో అతను బంజారాహిల్స్‌(Banjara Hills) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతకు ముందు కూడా రెండు వాహనాలు ఇలాగే చోరీకి గురయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. కృష్ణానగర్‌కు చెందిన పొట్లూరి చంద్రశేఖర్‌ అని గుర్తించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రూ.23 లక్షలు లూటీ చేసేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..


అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా సినీ పరిశ్రమలో మేకప్‌ ఆర్టిస్టు గా పనిచేస్తున్నాడు. షూటింగ్‌లు లేకపోవడంతో మద్యం తాగేందుకు డబ్బులు లేక చోరీలు చేస్తున్నట్టు తేలింది. 2022లో అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ చోరీ కేసులో నిందితుడు. ఈయేడాది బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో నాలుగు చోరీలు చేశాడు. దొంగలించిన బండ్లను సినీ పరిశ్రమలో పనిచేస్తున్న రెడ్డి నాగవీర వెంకట సత్యనారాయణ వద్ద కుదవ పెడుతున్నట్టు తేలింది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 11:24 AM