Hyderabad: వాహనాల చోరీ.. ఓఎల్‌ఎక్స్‌లో విక్రయం..
ABN , Publish Date - Jun 11 , 2024 | 11:39 AM
ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ వాటికి నకిలీ రిజిస్ర్టేషన్ నెంబర్లను అమర్చి ఓఎల్‌ఎక్స్(OLX)లో విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను బోయినపల్లి క్రైమ్ పోలీసులు(Boinapally Crime Police) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని నార్త్‌జోన్ డీసీపీ రోహిణిప్రియదర్శిని తెలిపారు.
- నకిలీ ఆర్సీలు సృష్టించి.. రూ.10 నుంచి 15 వేలకే అమ్మకం
- 14 వాహనాలు, ల్యాప్‌టాప్, నకిలీ ఆర్‌సీకార్డుల స్వాధీనం
- ముగ్గురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్: ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ వాటికి నకిలీ రిజిస్ర్టేషన్ నెంబర్లను అమర్చి ఓఎల్‌ఎక్స్(OLX)లో విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను బోయినపల్లి క్రైమ్ పోలీసులు(Boinapally Crime Police) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని నార్త్‌జోన్ డీసీపీ రోహిణిప్రియదర్శిని తెలిపారు. ఈ మేరకు మంగళవారం బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సర్దార్‌నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. సూరారంకాలనీ కుత్బుల్లాపూర్ అమిత్‌బస్తీకి చెందిన రజాక్‌ఖాన్(38) బైక్ మెకానిక్. ఏలూరు కొండవోలె గ్రామానికి చెందిన యామాల యోహాను అలియాస్ యోహాను(29) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మియాపూర్ హఫీజ్‌పేట్‌లో నివాసం ఉంటూ కార్ డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలో రజాక్‌ఖాన్‌కు యోహనుతో పరిచయం ఏర్పడింది.
ఇదికూడా చదవండి: Hyderabad: సూచిక బోర్డును కప్పేసి.. కబ్జాకు స్కెచ్ వేశాడుగా..
ఈ క్రమంలో ఇద్దరూ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఈ క్రమంలో 2023 నుంచి బోయినపల్లి తిరుమలగిరి, నాంపల్లి, జీడిమెట్ల, అల్వాల్‌తో పాటు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధుల్లో తెల్లవారిజామున 3 గంటల ప్రాంతంలో రోడ్లపైన నిలిపి ఉన్న ద్విచక్రవాహనాలను చోరీచేస్తున్నారు. దొంగిలించిన వాహనాలను రెండు మూడు రోజులపాటు పోలీసులు గుర్తించని ప్రాంతాల్లో నిలిపి వెళ్లేవారు. ఆ తరువాత కృష్ణాజిల్లా గొల్లపాలెం మచిలీపట్నంలో ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్‌ను నడిపిస్తున్న గొరిపర్తి వెంకటప్పయ్య(28) ద్వారా నకిలీ ఆర్‌సీలను సృష్టించారు. దీంతో దొంగిలించిన ద్విచక్ర వాహనాలకు నకలీ రిజిస్ర్టేషన్లు చేసి ఓఎల్‌ఎక్స్ యాప్ ద్వారా వాటిని రూ.10వేల నుంచి రూ.15 వేలకే విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఓఎల్‌ఎక్స్‌లో వాహనాలను కొనుగోలు చేసినవారు ఆర్‌సీ అడగడంతో వారు పొంతనలేని సమాధానాలు చెప్తూ దాటవేస్తున్నారు.
దీంతో అనుమానం వచ్చిన ఓ వ్యక్తి బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బోయినపల్లి క్రైమ్ పోలీసుల బృందానికి రజాక్ ఖాన్, యామాల యోహను అలియాస్ యోహాను, గొరిపర్తి వెంకటప్పయ్య ముఠాగా ఏర్పడి నకిలీ ఆర్సీలను సృష్టించి వాహనాలు అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో నిందితులను అడుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలకు పాల్పడుతూ ఓఎల్‌ఎక్స్‌లో విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. వీరి నుంచి 8 లక్షల విలువైన 14 ద్విచక్ర వాహనానలు, ఓ ల్యాప్ టాప్‌ను, నకిలీ ఆర్‌సీ కార్డులను స్వాధీనం చేసుకున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. దీంతో ప్రతిభ కనపరిచిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సర్దార్ నాయక్, ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి, డీఎస్ఐ తుల్జారాం, ఎస్‌ఐ అనిల్, కానిస్టేబుళ్లు రమేష్, మురళి, శివశంకర్, మహేష్, శివకుమార్, శ్రీనివాసును డీసీఈ, అదనపు డీసీపీ పి.అశోక్, బేగంపేట్ ఏసీపీ పి.గోపాలకృష్ణమూర్తి అభినందించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News