Health Tips: ఈ సమస్య ఉన్నవారు రోజూ గుడ్లు తినాలి.. ఎందుకంటే..!
ABN , Publish Date - Aug 09 , 2024 | 08:40 PM
Healthy Lifestyle: గుడ్డులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక గుడ్డు తింటే శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు తప్పకుండా తమ బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు ఉండేలా చూసుకుంటారు. గుడ్లతో అనేక రకాల వంటకాలు చేయొచ్చు.
Healthy Lifestyle: గుడ్డులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక గుడ్డు తింటే శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు తప్పకుండా తమ బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు ఉండేలా చూసుకుంటారు. గుడ్లతో అనేక రకాల వంటకాలు చేయొచ్చు. గుడ్డులో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, రిబోఫ్లావిన్, ఫోలేట్ అలాగే సెలీనియం, అయోడిన్, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా కండరాల నొప్పులు, గుండె సంబంధిత సమస్యలు, కళ్లు, ఊబకాయం, ఎముకల సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారు రోజూ గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గుడ్లు తినడం వలన కలిగే ప్రయోజనాలు..
1. కండరాలు: గుడ్లలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర కండరాల పెరుగుదల, మరమ్మతులకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఆరోగ్యాన్ని పెంచుతుంది.
2. గుండె: గుడ్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
3. కళ్ళు: గుడ్లలో ల్యూటిన్, జియాక్సంతిన్ ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ముఖ్యమైనవి. కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
4. ఊబకాయం: గుడ్లు తినడం వల్ల ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా ఉంటుంది. దీని వల్ల మనం అతిగా తినకుండా ఉండొచ్చు. బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
5. జ్ఞాపకశక్తి: గుడ్లు మెదడు ఆరోగ్యానికి అవసరమైన కోలిన్‌ను కలిగి ఉంటాయి. జ్ఞాపకశక్తి మెరుగవ్వాలంటే గుడ్లు తినవచ్చు.
6. ఎముకలు: గుడ్లలో విటమిన్ డి ఉంటుంది. ఇది కాల్షియం శోషణను ప్రోత్సహిస్తుంది. గుడ్లు తీసుకోవడం ద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయి.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు వైద్య, ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.