Share News

Fingernails: గోళ్లల్లో 32 రకాల బాక్టీరియాలు ఉంటాయట..మరి ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

ABN , Publish Date - Feb 02 , 2024 | 08:59 PM

గోళ్లల్లో పలు రకాల బ్యాక్టీరియా, ఫంగస్‌లు ఉంటాయి కాబట్టి గోళ్ల ఆరోగ్యం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

Fingernails: గోళ్లల్లో 32 రకాల బాక్టీరియాలు ఉంటాయట..మరి ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

ఇంటర్నెట్ డెస్క్: గోళ్ల ఆరోగ్యంపై జరిగిన ఓ అధ్యయనం ప్రకారం, గోళ్లల్లో దాదాపు 32 రకాల బాక్టీరియా, 28 రకాల ఫంగై ఉంటాయట. కాబట్టి, గోళ్ల ఆరోగ్యం విషయంలోనూ ప్రత్యేకశ్రద్ధ వహించాలని వైద్యులు చెబుతున్నారు. పలు జాగ్రత్తలు కూడా సూచిస్తున్నారు (How to keep finger nails clean and healthy).

  • గోళ్ల ఆరోగ్యానికి విటమిన్ ఏ, సీ,డీ,ఈ ఎంతో కీలకం. ఐరన్, జింక్ కూడా కీలకమే. ఇవన్నీ పళ్లు, కూరగాయల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతి రోజూ తినాలని వైద్యులు చెబుతున్నారు.

  • బయోటిన్ సప్లిమెంట్లు కూడా గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

  • శరీరానికి తగినంత నీరు తాగితే గోళ్లల్లో కూడా తేమ తగినంత ఉంటుంది. దీంతో, అవి పెళుసుబారడం, త్వరగా విరిగిపోవడం వంటివి జరగవు

  • గోళ్లు బాగుండాలంటే రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి.

  • గోళ్లు తీసుకునేటప్పుడూ కొన్ని జాగ్రత్తగా పాటించాలి. చర్మానికి దగ్గరా వచ్చేలా గోళ్లు తీయకూడదు. అతిగా ట్రిమ్ చేస్తే ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

  • నీళ్లల్లో గోళ్లు ఎక్కువగా తడిసినా ఇబ్బందే. కాబట్టి, గోళ్లు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి.

  • ఇంట్లో గిన్నెలు తోమేటప్పుడు దుస్తులు ఉతికేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. కఠిన రసాయనాలతో పనిచేసేటప్పుడు తప్పకుండా గ్లోవ్స్ ధరించాలి.

  • గోళ్ల సెలూన్లకు కూడా పలుమార్లు వెళ్లకూడదు. సెలూన్లలో వాడే పరికరాలు శుభ్రంగా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. అసిటోన్ లేని నెయిల్ పాలిషర్లనే వినియోగించాలి.

  • గోళ్లు పలుచగా మారినా, రంగు మారినా, మరేఇతర తేడాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Updated Date - Feb 02 , 2024 | 09:03 PM