Deep Fried Foods: మరగకాగిన నూనెలతో చేసిన వేపుళ్లు తెగ తింటే.. రిస్క్‌లో పడ్డట్టే!
ABN , Publish Date - Apr 07 , 2024 | 06:33 PM
తరచూ వేపుళ్లు తినేవారు బీపీ, మధుమేహం, క్యాన్సర్, హృద్రోగాల బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. వీటిని అప్పుడప్పుడూ తింటేనే ఆరోగ్యం బాగుంటుందని సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి వేపుళ్లు అంటే మహా ఇష్టం. ఇవి సులువుగా చేసుకునేలా ఉండటంతో పాటూ రుచిగా ఉంటాయని తరచూ తింటుంటారు. ఇంకొందరు హోటళ్లల్లోనూ వీటినే ఆర్డర్ చేస్తుంటారు. అనేక సందర్భాల్లో వీటిని మరగకాగిన నూనెలో (Deep Fried Foods) చేస్తారని తెలిసినా కంట్రోల్ చేసుకోలేక ఇవే తింటుంటారు. ఈ అలవాటుతో అనేక ప్రమాదాలు (Health Issues) ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Brain Health: జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగాలంటే రోజూ పరగడుపున ఇవి తినండి!
వేపుళ్లలోని నూనె అంతా శరీరంలో చేరి కొవ్వుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉడకబెట్టిన లేదా మంటపై కాల్చిన వాటికంటే వేయించిన వాటితో శరీరంలోకి కెలోరీలు అధికంగా చేరుతాయి. శరీరం వీటిని త్వరగా వినియోగించుకోలేక చివరకు కొవ్వుగా మార్చుతుంది. ఇలా ఒంట్లో పేరుకుపోయే కొవ్వులు చివరకు దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయని చెబుతున్నారు. ఉదాహరణకు వేయించిన 100 గ్రాముల బంగాళ దుంపతో 17 గ్రాముల కొవ్వు, 319 కెలొరీల శక్తి శరీరంలో చేరుతుంది. అదే ఉడికించినది తింటే కేవలం 93 కెలొరీల శక్తే అందుతుంది.
Olive Oil: ప్రతి రోజూ ఆలివ్ ఆయిల్ ఫుడ్స్ తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా?
ఇక నూనెలో వేయిస్తే ఆహారంలో రసాయనిక మార్పులు వస్తాయి. వేపుళ్లల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ శాతం పెరుగుతుంది. ఇవి శరీరంలో చేరితే గుండెజబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. ఎక్కువగా కాలం నిల్వ ఉంచిన ఆహారం వల్ల కూడా ఇలాంటి సమస్యలే వస్తాయి.
కొన్ని అధ్యయనాల ప్రకారం, వారానికి 4-6 సార్లు వేపుళ్లు తినే వారిలో మధేమేహం వచ్చే అవకాశం 39 శాతం పెరుగుతుందట. బీపీ పెరిగి, మంచి (హెచ్‌డీఎల్) కొలెస్టెరాల్ స్థాయిలు తగ్గుతున్నట్టు కూడా పరిశోధకులు గుర్తించారు. కాబట్టి, ఆరోగ్యం కాపాడుకోవాలంటే వేపుళ్లను బాగా తగ్గించడమే మేలనేది నిపుణులు చెప్పేమాట.
Sugar Facts: చక్కెర గురించి ఎవరైనా ఇలా చెబితే అస్సలు నమ్మొద్దు!
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి