Omega-3: శాఖాహారులలో ఒమేగా-3 లోపమా? ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!
ABN , Publish Date - May 14 , 2024 | 03:57 PM
శరీరానికి అవసరమైన వాటిలో ఒమేగా-3 కొవ్వులు కూడా ఒకటి. అయితే ఈ ఒమేగా-3 కొవ్వులు ఏయే ఆహారాలలో లభిస్తాయో చాలామందికి తెలియదు. మరీ ముఖ్యంగా ఒమేగా-3 మాంసాహారంలో ఎక్కువగా లభిస్తుండటంతో శాఖాహారులు దీని లోపంతో ఇబ్బంది పడతారు.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం అవసరం. సమతుల్య ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఆరోగక్యకరమైన కొవ్వులు అన్నీ ఉంటాయి. ఇలా శరీరానికి అవసరమైన వాటిలో ఒమేగా-3 కొవ్వులు కూడా ఒకటి. అయితే ఈ ఒమేగా-3 కొవ్వులు ఏయే ఆహారాలలో లభిస్తాయో చాలామందికి తెలియదు. మరీ ముఖ్యంగా ఒమేగా-3 మాంసాహారంలో ఎక్కువగా లభిస్తుండటంతో శాఖాహారులు దీని లోపంతో ఇబ్బంది పడతారు. ఒమేగా-3 లభించే సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుంటే..
అవిసెగింజలు చాలామందికి తెలిసినా వీటిని వాడేవారు తక్కువ. వీటిలో ఆల్పా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరం EPA, DHA గా మార్చగల ఒమేగా-3 కొవ్వు ఆమ్లం. అవిసె గింజలు తీసుకుంటే ఒమేగా-3 పుష్కలంగా అందుతుంది.
ఈ అలవాట్లు ఉన్నవారు మేధావులు అవుతారట..!
చియా విత్తనాలు ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయ్యాయి. ఇవి పోషకాలకు పవర్ హౌస్ అని చెప్పవచ్చు. చియా విత్తనాలలో కూడా ఆల్పా-లినోలెనిక్ ఆమ్లం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
వాల్నట్ లలో ఆల్పా-లినోలెనిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. సలాడ్ లు, పెరుగు, స్మూతీలలోనూ, షేక్స్ లోనూ లేదా రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినడానికి వీటిని ప్రయత్నించవచ్చు. ఇవి ఒమేగా-3 ని భర్తీ చేస్తాయి.
చాలామందికి జనపనార విత్తనాలు తెలియవు. కానీ జనపనార విత్తనాలు ప్రోటీన్, ఫైబర్ తో పాటూ ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లాన్ని కూడా కలిగి ఉంటాయి. వీటిని తీసుకుంటే ఒమేగా-3 గురించి భయపడాల్సిన అవసరం ఉండదు.
లాప్టాప్ ను ఒడిలో పెట్టుకుని వాడే అలవాటుందా? ఈ నిజాలు తెలిస్తే..!
సోయాబీన్స్ ఇంకా పూర్తీగా కాయగా మారకముందే అవి చిక్కుళ్ల రూపంలో ఉంటే వాటిని ఎడమామ్ అని అంటారు. ఎడమామ్ లో ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
క్రూసిఫరస్ కు చెందిన కూరగాయలలో బ్రెస్సెల్ మొలకలు ముఖ్యమైనవి. వీటిలో ఆల్పా-లినోలెనిక్ ఆమ్లం ఉంటుంది. వీటిని వేయించి లేదా ఆవిరిలో ఉడికించి అయినా తీసుకోవచ్చు.
ఒమేగా-3 కొవ్వులు మొక్కల ఆధారిత పాలలోనూ, మొక్కల ఆధారిత ఆహారంలోనూ పుష్కలంగా ఉంటాయి. శాఖాహారులు వీటిని నిరభ్యరంతంగా తీసుకోవచ్చు.
లాప్టాప్ ను ఒడిలో పెట్టుకుని వాడే అలవాటుందా? ఈ నిజాలు తెలిస్తే..!
ఈ అలవాట్లు ఉన్నవారు మేధావులు అవుతారట..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.