Vitamin B12: మీరు శాకాహారులా? విటమిన్-బి12 కోసం ఇవి తినండి చాలు..!
ABN , Publish Date - Sep 03 , 2024 | 11:32 AM
విటమిన్ B12 అనేది మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్. దీని లోపం వల్ల శరీరం అలసట, చిరాకు, బద్ధకం, ఏకాగ్రతలో ఇబ్బంది, నడవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి.
విటమిన్ B12 అనేది మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్. దీని లోపం వల్ల శరీరం అలసట, చిరాకు, బద్ధకం, ఏకాగ్రతలో ఇబ్బంది, నడవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు మొదలవుతాయి. ఆహారంలో విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలి. సాధారణంగా విటమిన్-బి12 మాంసాహారంలో ఎక్కువ లభ్యమవుతుంది. కానీ కొన్ని శాకాహార ఆహారాలో కూడా విటమిన్-బి12 లభిస్తుంది. దీనికి ఏ ఆహారాలు ఉత్తమం తెలుసుకుంటే..
Shampoo: షాంపూ కూడా విషంలా ప్రభావం చూపిస్తుందా? ఈ నిజాలు తెలిస్తే..!
స్విస్ చీజ్..
శాకాహారులకు విటమిన్-బి12 పుష్కలంగా లభించాలంటే స్విస్ చీజ్ బాగా తీసుకోవాలి. జున్నులో విటమిన్-బి12 పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా స్విస్ చీజ్ లోనే ఎక్కువ. 50గ్రాముల స్విస్ చీజ్ తీసుకుంటే 1.5మై.గ్రా లి విటమిన్-బి12 లభిస్తుంది.
పెరుగు..
శాకాహారులు ఆహారంలో పెరుగును చేర్చుకుంటే విటమిన్-బి12 పొందవచ్చు. పెరుగులో విటమిన్-బి12 పుష్కలంగా ఉంటుంది. పెరుగు ఆహారంతో అయినా తినవచ్చు. లేదంటే పెరుగుతో లస్సీ వంటివి కూడా తయారు చేసుకుని తీసుకోవచ్చు.
పనీర్..
పనీర్ రోజువారీ విటమిన్-బి12 అవసరాన్ని కనీసం 20శాతం భర్తీ చేస్తుంది. 100గ్రాముల పనీర్ లో 0.8 మై.గ్రా ల విటమిన్-బి12 ఉంటుంది. ఇది పెద్దలకు కావాల్సిన విటమిన్-బి12 మొత్తంలో మూడవ వంతు .
Green Tea: ఈ సమయంలో గ్రీన్ టీ తాగండి.. ఫలితాలు చూసి షాక్ అవుతారు..!
బీట్రూట్..
బీట్రూట్ లో కూడా విటమిన్-బి12 ఉంటుంది., శాకాహారులు తమ ఆహారంలో బీట్రూట్ ను తీసుకుంటే విటమిన్-బి12 ను భర్తీ చేసుకోవచ్చు. బీట్రూట్ ను కూరలు, జ్యూస్, స్మూతీలు మొదలైన వివిధ రకాలుగా తీసుకోవచ్చు.
పాలకూర..
పాలకూరలో విటమిన్-బి12 సమృద్దిగా ఉంటుంది. పాలకూరను కూరగానే కాకుండా సూపులు, గ్రేవీలలో కూడా ఉపయోగించవచ్చు. పాలకూరను జ్యూస్ గా కూడా తీసుకోవచ్చు.
Snoring: గురకతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే నిద్రకు ఇబ్బంది ఉండదు..!
సోయా పాలు..
శాకాహారులు విటమిన్-బి12 కోసం సోయా మిల్క్ కూడా తీసుకోవచ్చు. సోయా మిల్క్ బెస్ట్ వేగన్ మిల్క్ గా పరిగణించబడుతుంది.
పులియబెట్టిన ఆహారాలు..
చాలామందికి తెలియదు కానీ పులియబెట్టిన ఆహారాలలో విటమిన్-బి12 ఉంటుంది. ముఖ్యంగా ఇడ్లీ, దోశ, ఢోక్లా వంటి ఆహారాలలో విటమిన్-బి12 ఉంటుంది. వీటిని తరచుగా తీసుకుంటే విటమిన్-బి12 భర్తీ అవుతుంది.
ఇవి కూడా చదవండి..
వినాయక చవితికి మిల్లెట్స్ తో కుడుములు ఇలా చేయండి..!
పంచముఖి ఆంజనేయ స్వామి పటాన్ని ఇంట్లో ఇక్కడ ఉంచితే మంచిది..!
ఈ ఉదయపు చెడ్డ అలవాట్ల వల్ల బరువు పెరుగుతారట..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.